గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఆన్ లైన్ గేమ్ పబ్-జి ఇండియా నుండి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇక పై పబ్-జి గేమ్ అందుబాటులో ఉండదని కూడా తెలిపింది. అయితే తాజాగా దీనిపై  ఇండియన్ మొబైల్ గేమర్‌లకు పబ్-జి శుభవార్త అందించింది.

పబ్-జి మొబైల్ ఇండియాను పబ్-జి కార్పొరేషన్ భారతదేశంలో త్వరలో అధికారికంగా ప్రారంభించనుంది. దీని కొత్త వెర్షన్ పేరు పబ్-జి మొబైల్ ఇండియా. పబ్-జి కార్పొరేషన్ ప్రకారం, కొత్త వెర్షన్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పబ్-జి మొబైల్ ఇండియా అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

పబ్-జి కార్పొరేషన్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "ప్లేయర్స్ వార్ గ్రౌండ్ (పబ్-జి) గేమ్ సృష్టికర్త అయిన పబ్-జి కార్పొరేషన్ భారతదేశంలో పబ్-జి మొబైల్ ఇండియా గేమ్ ను తిరిగి ఇండియాలోకి తీసుకురావడం  కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రకటించాయి.

also read 98 రెట్లు వేగవంతమైన సరికొత్త టెక్నాలజీతో ఆపిల్ మ్యాక్ బుక్ మోడల్స్.. ...

పబ్-జి కార్పొరేషన్ దక్షిణ కొరియా సంస్థ అయిన క్రాఫ్టన్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ ప్రకారం, పబ్-జి మొబైల్ ఇండియా గేమ్ ను  ప్రత్యేకంగా భారతదేశం కోసం రూపొందించాము. పబ్‌జి మొబైల్ ఇండియా వినియోగదారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన గేమ్స్ ఆడటానికి అవకాశం కల్పిస్తుంది.

పబ్-జి కార్పొరేషన్ కూడా భారతదేశంలో అనుబంధ సంస్థను నిర్మిస్తామని ప్రకటించింది. ఇది మాత్రమే కాదు,  యొక్క ఇండియన్ సబ్సిడరీ కంపెనీ 100 మంది ఉద్యోగులను కూడా నియమించనుంది.

దీనికి స్థానిక కార్యాలయాలను సిద్ధం చేయనుంది. కంపెనీ లోకల్  బిజినెస్ సహకారంతో భారతదేశంలో గేమింగ్ సర్వీస్ కూడా నిర్వహించనుంది. అయితే, భారతదేశంలో ఈ గేమ్ ప్రారంభ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

పబ్-జి కార్పొరేషన్ మాతృ సంస్థ అయిన  క్రాఫ్టన్ ఇంక్ భారతదేశంలో 100 మిలియన్ల పెట్టుబడిని కూడా ప్రకటించింది. అలాగే సంస్థ లోకల్ గేమ్స్, ఇ-స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఐటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి భారతదేశంలోని ఏ దక్షిణ కొరియా కంపెనీ చేయని అతిపెద్ద పెట్టుబడిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.