గతకొద్ది రోజులుగా ఇండియాలోకి పబ్-జి  రిఎంట్రీపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పబ్-జి ఫ్యాన్స్ కి నిరాశే ఎదురుకానుంది. ఎందుకంటే పబ్-జి సరికొత్త వెర్షన్ లో ఇండియాలోకి రిఎంట్రీ ఇవ్వనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెల్లడైంది. 
 
భారత ప్రభుత్వంతో పబ్-జి ప్రమోటర్ల సమావేశం అభ్యర్థనపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం‌ఈ‌ఐ‌టి‌వై) ఇంకా స్పందించలేదని వర్గాలు పేర్కొనడంతో పబ్-జి మొబైల్ భారతదేశంలో త్వరలో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఒక నివేదిక ప్రకారం పబ్-జి ప్రమోటర్లు 4 వారాల క్రితం భారత ప్రభుత్వంతో సమావేశం కోసం అభ్యర్థించారు, కాని కేంద్రం ఈ అభ్యర్థనపై ఇంకా స్పందించలేదు.

also read మరో మూడు పట్టణాల్లో జియోఫైబర్ సేవలు.. ఆన్ లిమిటెడ్ డేటాతో ఆకర్షణీయమైన ప్లాన్స్ .. ...

"సమావేశం కోసం చేసిన అభ్యర్థనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించడానికి పబ్-జి గేమ్ ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారు. కాని ఎం‌ఈ‌ఐ‌టి‌వై కార్యాలయం నుండి ఎటువంటి స్పందన రాలేదు" అని పబ్-జి ప్రమోటర్లకు దగ్గరగా ఉన్న వర్గాలు తెలిపాయి.

పబ్-జి త్వరలో భారతదేశంలో తిరిగి రాబోతోందని కొద్దిరోజులుగా పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నప్పటికి వాస్తవం ఏమిటంటే, భారతదేశంలోకి పబ్-జి తిరిగి రావడానికి కంపెనీ భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందవలసి ఉంది.

ఇండియాలోకి రిఎంట్రీ కోసం అనుమతి పొందడంలో సమావేశం తమకు సహాయపడుతుందని పబ్-జి ప్రమోటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని పబ్-జి సన్నిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరికి ముందు భారతదేశంలో పబ్-జి రిఎంట్రీ చాలా కఠినమైనదిగా అనిపిస్తుందని మూలలు తెలిపాయి.

సెప్టెంబరులో భారత ప్రభుత్వం వందకు పైగా చైనీస్ యాప్‌లతో పాటు భారతదేశంలో పబ్-జి మొబైల్‌ను నిషేధించిన విషయం మీకు తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ అజూర్ తన సర్వర్లు, డేటా సెంటర్లలో గేమ్ ను హోస్ట్ చేయడానికి పబ్-జి మొబైల్‌తో భాగస్వామ్యం పొందే అవకాశం ఉంది, భారతదేశంలో పబ్-జి రిఎంట్రీ గురించి సంస్థకి ఇంకా ప్రభుత్వం ఎటువంటి సమాచారం రాలేదని తెలిపింది.