డిజిటల్ అండ్ పోర్టబుల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పోర్ట్రానిక్స్ కొత్త ఉత్పత్తి హార్మోనిక్స్ 300 వైర్‌లెస్ స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌లో హెచ్‌డి స్టీరియో సౌండ్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సల్ ఉంటుంది.

దీనితో పాటు నెక్‌బ్యాండ్‌లో బలమైన బ్యాటరీ అందించారు, ఒక ఫుల్ ఛార్జీపై 8 గంటల బ్యాకప్‌ను ఇస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్ తో నాలుగు గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది.
 
పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ 300 నెక్‌బ్యాండ్‌లో గొప్ప సౌండ్ కోసం హెచ్‌డి స్టీరియోతో 10 ఎంఎం డ్రైవర్లు అందించారు. ఈ నెక్‌బ్యాండ్‌లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లు ఇచ్చారు. ఇది కాకుండా, ఈ నెక్‌బ్యాండ్‌లో బలమైన బ్యాటరీతో వస్తుంది.

also read ఫ్యామిలి మొత్తానికి ఆన్ లిమిటెడ్ కాల్స్, డాట ప్రయోజనలతో వోడాఫోన్ ఐడియా కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్.. ...

ఇతర ఫీచర్స్ గురించి చెప్పాలంటే పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ 300 నెక్‌బ్యాండ్‌లో కనెక్టివిటీ కోసం కంపెనీ బ్లూటూత్ 5.0ను ఇచ్చింది. ఈ స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్ ఐ‌పిఎక్స్4గా రేట్ చేయబడింది, అంటే నెక్‌బ్యాండ్ వాటర్, డస్ట్ ప్రూఫ్ కూడా.

పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ 300 ధర, లభ్యత

పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ 300 నెక్‌బ్యాండ్ ధర రూ.2,999, అయితే కంపెనీ వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 1,499 ఇది ప్రత్యేక పరిచయ ధర కావచ్చు. స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

12 నెలల వారంటీ కూడా లభిస్తుంది. పోర్ట్రానిక్స్ ప్రకారం హార్మోనిక్స్ 300 సిలికాన్ పదార్థంతో రూపొందించారు, ఇది చర్మాన్ని చికాకు పెట్టకుండా ఎక్కువ గంటలు ధరించగలిగేలా చేస్తుంది.