POCO M4 Pro 5G: పోకో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ధ‌ర ఎంతంటే..?

పోకో ఎం4 ప్రో 5జీ పేరుతో కొత్త ఫోన్​ను తీసుకురానున్నట్లు కంపెనీ ఎప్పుడో ప్రకటించగా.. తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన ఈ ఫోన్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పోకో అధికారికంగా ప్రకటించింది. 

POCO M4 Pro 5G

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమి సబ్​ బ్రాండ్ పోకో భారత్​లో మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎం4 ప్రో 5జీ పేరుతో కొత్త ఫోన్​ను తీసుకురానున్నట్లు కంపెనీ ఎప్పుడో ప్రకటించగా.. తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన ఈ ఫోన్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పోకో అధికారికంగా ప్రకటించింది. ఈ సారి మెటావర్స్​లో కాకుండా ఆఫ్​లైన్‌లో లాంచింగ్ ఉంటుందని పోకో హింట్ ఇచ్చింది.

ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్లో విడుదలై విక్రయాలు కూడా ప్రారభమయ్యాయి. గేమింగ్ ఫోన్​గా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. పోకో ఎం4 ప్రో 5జీ రెండి వేరియంట్లలో లభించనుంది. ఇందులో 4జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్​ను ఆరంభ ఆఫర్​ కింద ధర రూ.15,000కు విక్రయించి.. ఆ తర్వాత రూ.17,000లకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,200గా నిర్ణయించే అవకాశముంది. ఇక ఇండియాలో ఫ్లిప్​కార్ట్ ద్వారానే ఈ ఫోన్లు విక్రయమయ్యే అవకాశాముంది.

ఈ ఫోన్ MediaTek Dimension 810 5G చిప్‌సెట్‌తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేటు 90hg. వెనుక పేన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ముందు ప్యానెల్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే ఉంది. వెనకవైపు రెండు కెమెరాలు 50 ఎంపీ+8 ఎంపీ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్​, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ (33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​)తో ఈ మొబైల్ భార‌త్‌లో ఈనెల 15వ తేదీన విడుద‌ల కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios