Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే ఫీచర్లతో పోకో ఎం2ప్రో స్మార్ట్ ఫోన్ సేల్స్ నేడే ప్రారంభం..

పోకో ఎం2 ప్రో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఇందులో  ఉంది. ఇది మూడు ర్యామ్, స్టోరేజ్  వెరీఎంట్స్ , మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఫోన్ పెద్ద బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనపు రక్షణ కోసం కంపెనీ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం పి2ఐ నానో-కవర్ జోడించింది.
 

poco m2pro smartphones sales start from today in flipkart
Author
Hyderabad, First Published Aug 8, 2020, 3:07 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో  సరికొత్త స్మార్ట్ ఫోన్ పోకో ఎం2 ప్రో మరోసారి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ రోజు ఆగస్టు 6న భారతదేశంలో మధ్యాహ్నం నుండి సేల్స్ ప్రారంభించింది. రెడ్‌మి నోట్ 9 ప్రో కొద్దిగా అడ్జస్ట్ చేసిన వెర్షన్‌గా ఈ ఫోన్‌ను జూలైలో లంచ్ చేశారు. 

పోకో ఎం2 ప్రో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఇందులో  ఉంది. ఇది మూడు ర్యామ్, స్టోరేజ్  వెరీఎంట్స్ , మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఫోన్ పెద్ద బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అదనపు రక్షణ కోసం కంపెనీ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం పి2ఐ నానో-కవర్ జోడించింది.


భారతదేశంలో పోకో ఎం2ప్రో ధర, సెల్ ఆఫర్లు
పోకో ఎం2ప్రో మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. బేస్ వెరీఎంట్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999, 6 జిబి + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 కాగా, టాప్ ఎండ్ 6 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16.999. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేడు మధ్యాహ్నం 12 గంటలకు నుండి  సేల్స్ వచ్చినప్పుడు ప్రారంభమవుతాయి. బ్లూ, గ్రీన్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

also read బి‌ఎస్‌ఎన్‌ఎల్ కొత్త పోర్టల్.. భారత్ ఫైబర్ కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా.. ...

కస్టమర్ల కోసం ఫ్లిప్ కర్ట్ కొన్ని ఆఫర్లను అందిస్తుంది. మీరు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులతో కొంటె 10 శాతం ఆఫ్, రుపే డెబిట్ కార్డు ఉపయోగించి మొదటి ప్రీపెయిడ్ లావాదేవీపై 30 తగ్గింపు, యుపిఐ ఉపయోగించి మొదటి ప్రీపెయిడ్ లావాదేవీకి 30 ఆఫ్ అందిస్తుంది.

వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, మూడు నుండి తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ప్లాన్‌ కూడా పొందవచ్చు.

పోకో ఎం2ప్రో ఫీచర్లు 
డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 లో పోకో కోసం ఎంఐయుఐ 11తో నడుస్తుంది. 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్‌లు) డిస్ ప్లే, 6జి‌బిLPDDR4X ర్యామ్ తో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 720G SoC చేత పవర్ చేస్తుంది.

ఫోటోలు, వీడియోల కోసం పోకో ఎం2ప్రోలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం సెంట్రల్ హోల్-పంచ్‌లో 16 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.

స్టోరేజ్ కోసం పోకో ఎం2 ప్రో 128జి‌బి వరకు UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ తో 512GB వరకు ద్వారా పెంచుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్స్ లో  4జి వి‌ఓ‌ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

పోకో ఎం2 ప్రో లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్  చేసే 5,000mAh బ్యాటరీతో  వస్తుంది. చివరగా ఫోన్ 209 గ్రాముల బరువు ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios