ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ ఫోన్స్ పై మరో ఆఫర్ ప్రవేశపెట్టింది. పోకో స్మార్ట్ ఫోన్స్ పై పోకో డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొచ్చింది. పోకో ఎక్స్3, పోకో సి3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్స్ పై  డిస్కౌంట్‌ ఇస్తుంది. ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌లపై  ఆసక్తిగల కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ఆఫర్లు కూడా అందిస్తుంది. పోకో డేస్ సేల్ ఈ రోజు ప్రారంభమై డిసెంబర్ 6 వరకు ఉంటుంది. పోకో ఎక్స్3 ధర రూ. 15,999 ఉండగా, పోకో సి3 ధర రూ.6,999. రెండేళ్లపాటు షియోమితో భాగమైన తరువాత ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర గుర్తింపు లభిస్తుంది అని పోకో ఇటీవల ప్రకటించింది.


ఫ్లిప్‌కార్ట్‌లో పోకో డేస్ సేల్ లో పోకో సి3, పోకో ఎం2, పోకో ఎం2ప్రో, పోకో ఎక్స్3 అనే నాలుగు పోకో స్మార్ట్ ఫోన్‌లపై  డిస్కౌంట్, ఆఫర్లను అందిస్తుంది. పోకో సి3 బేస్ వెరీఎంట్ 3జిబి + 32జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 సాధారణంగా దీని ధర  రూ.7,499. 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999 ఎం‌ఆర్‌పి ధర రూ.8,999. ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్, మాట్టే బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

పోకో ఎం2 6జీబీ + 64జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 9,999, అసలు ధర రూ. 10,999. 6జీబీ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,499, కానీ సేల్ సమయంలో దీని ధర  రూ.10,999. బ్రిక్ రెడ్, పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

also read ఆపిల్ 2020 బెస్ట్ యాప్స్ ఇవే.. ఉత్తమ ఐఫోన్ యాప్ గా వేక్‌అవుట్ యాప్.. ...

పోకో ఎక్స్3  బేస్ 6జి‌బి + 64జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ ధర సాధారణంగా రూ. 16,999 సేల్ సమయంలో దీని ధర రూ. 15,999. 6జి‌బి + 128జి‌బి స్టోరేజ్ మోడల్ ధర సాధారణంగా రూ. 18,499 కానీ సేల్ సంధార్బంగా దీని ధర రూ.16,999. టాప్-ఎండ్ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 18,999.

ఫ్లిప్‌కార్ట్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులతో 10 శాతం తగ్గింపుతో పోకో స్మార్ట్‌ఫోన్‌లపై ఖర్చులేని ఇఎంఐ ప్లాన్‌లు అందిస్తుంది.