Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం మనీ సంచలనం.. 3 ఏళ్లలో 66 లక్షల యూజర్లు..

రెండు సంవత్సరాల పాటు కార్యకలాపాలను పూర్తి చేసిన విజయ్ శేఖర్ శర్మ యాజమాన్యంలోని పేటీఎం సంస్థ, 70% యూజర్లు మొదటిసారి ఇన్‌స్టాల్‌ చేసుకొని వినియోగిస్తున్న వారే, 60% మంది చిన్న పట్టణాలు, నగరాల నుండి పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

Paytm Money surpasses Zerodha with 6.6 million users after 3years of establishment
Author
Hyderabad, First Published Sep 7, 2020, 5:56 PM IST

బెంగళూరు:  ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ పేటీఎం యాజమాన్యంలోని  పేటీఎం మనీ 6.6 మిలియన్ల కస్టమర్లను చేరుకుందని పేర్కొంది, అలాగే  దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థలలో ఒకటైన జెరోధాను అధిగమించింది.

రెండు సంవత్సరాల పాటు కార్యకలాపాలను పూర్తి చేసిన విజయ్ శేఖర్ శర్మ యాజమాన్యంలోని పేటీఎం సంస్థ, 70% యూజర్లు మొదటిసారి ఇన్‌స్టాల్‌ చేసుకొని వినియోగిస్తున్న వారే, 60% మంది చిన్న పట్టణాలు, నగరాల నుండి పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

మరోవైపు, జెరోధా( ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ )3 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది. ప్రస్తుతం పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌లో రోజూ రూ.20 కోట్ల విలువైన ప్రత్యక్ష మ్యూచువల్ ఫండ్లను విక్రయిస్తుంది.

also read ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌ వర్కింగ్ డేస్ ...

జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్), స్టాక్‌లకు సంబంధించి పీటీఎం మెరుగైన సేవలందిస్తుంది. వరుణ్‌  శ్రీధర్‌  జూలై 2020లో సీఈఓగా నియమితులయ్యారు. "ఆత్మనీర్బర్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న పేటీఎం మిలియన్ల మంది భారతీయుల సంపదను పెంచడానికి పేటీఎమ్‌ మనీ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు" పేటీఎం మనీ సీఈఓ వరుణ్‌ వశ్రీధర్‌ తెలిపారు.

2019 ఏప్రిల్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుండి లైసెన్స్ పొందినప్పటికీ, పేటీఎం మనీ ఆగస్టులో మాత్రమే స్టాక్ బ్రోకింగ్ సేవలను అందించడం ప్రారంభించింది. పేటీఎం మనీ స్టాక్ బ్రోకింగ్ సేవలను సెప్టెంబరులో పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు నివేదించింది.

Follow Us:
Download App:
  • android
  • ios