డిజిటల్ పేమెంట్ సర్వీస్ పేటీఎం  క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. వివిధ క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేసింది.

12-18 నెలల్లో 20 లక్షల మంది సభ్యులను చేర్చే లక్ష్యంతో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం సోమవారం తెలిపింది. పేటీఎం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రతి లావాదేవీపై కంపెనీ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

ఈ కార్డులను పర్ట్నర్ బ్యాంకులు క్రెడిట్ స్కోరు, పేటీఎం యాప్‌లోని కొనుగోలు విధానాల ఆధారంగా జారీ చేస్తాయని కంపెనీ తెలిపింది. "పేటీఎం భారతదేశ యువతకు, నిపుణులకు ప్రయోజనం చేకూర్చే విధంగా క్రెడిట్ కార్డులను అందించడమే మా లక్ష్యం. ఈ కార్డులను ఆర్ధికంగా సహాయపడటానికి రూపొందించబడ్డాయి.

also read 5 వేలకే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ? ...

కొత్తవారిని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా క్రెడిట్ మార్కెట్ ను మార్చగలదు" అని పేటీఎం లెండింగ్ సిఇఓ భావేష్ గుప్తా అన్నారు. క్రెడిట్‌ కార్డు అప్లికేషన్ నుండి కార్డు జారీ చేయడం వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరుగుతుందని కంపెనీ తెలిపింది.

"పేటీఎం క్రెడిట్ కార్డులు ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌తో, రివార్డ్ ప్రోగ్రాంను కలిగి ఉంటాయి. సంపాదించిన రివార్డ్ పాయింట్‌కు గడువు ఉండదు. వినియోగదారులు  రివార్డ్ పాయింట్‌లను వివిధ పేమెంట్ల కోసం ఉపయోగించుకోవచ్చు" అని ప్రకటనలో తెలిపింది.

పేటీఎం గిఫ్ట్ వోచర్ల రూపంలో క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది, ఈ వోచర్‌లను ఎక్కడైనా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.