ఈ సంవత్సరం ప్రజలకు ఇప్పటివరకు ఒక రోలర్‌కోస్టర్ రైడ్. ప్రయాణ పరిమితుల నుండి లాక్ డౌన్  వరకు ప్రజలు చాలా మార్పులతో పూర్తిగా కొత్త జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే ప్రతిఒక్కరికీ  వెబ్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లు, టీవీల్లో కంటెంట్ విస్తృతంగ అందుబాటులో ఉంది.

మార్చి 2020 నుండి ఇప్పటి వరకు టీవీ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య బారిగానే పెరిగింది, వెబ్ సిరీస్ ప్లాట్‌ఫాంలు కూడా అపూర్వమైనవి  సబ్ స్క్రైబర్స్ సంఖ్య పెరుగుదల నమోదు చేసింది.

మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ వెలాసిటీ ఏంఆర్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దాదాపు 73% ప్రతివాదులు  లాక్ డౌన్ సమయంలో కనీసం ఒక వెబ్ సిరీస్ సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేశారు.

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రారంభించిన అనేక కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలను విడుదల చేయడం కూడా ఇందులో కొంత భాగం. ప్రజలను ఈ వెబ్ సిరీస్‌లు, సినిమాలు కట్టిపడేశాయి, దీంతో వారు మరిన్ని ఓ‌టి‌టి సబ్ స్క్రిప్షన్ తీసుకునేల చేస్తున్నాయి.

also read అమెజాన్ లో డోర్ మ్యాట్స్, లోదుస్తులపై హిందూ దేవతల ఫోటోలు.. తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు.. ...

కానీ ఎక్కువ వెబ్ సిరీస్ ప్లాట్ ఫార్మ్ ల సబ్ స్క్రిప్షన్ పొందడం అంటే చాలా ఖరీదైనది. అంతే కాదు వాటిని మ్యానేజ్  చేయడం, చాలా ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ట్రాక్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీటితో పాటు మీకు ఇంట్లో డి‌టి‌హెచ్ కనెక్షన్ ఉంటే అది ఇంకా అదనపు ఖర్చు.

ఎయిర్ టెల్ ఈ విషయాన్ని గుర్తించింది, ఇందుకోసం కొత్త ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకువచ్చింది. స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ వినియోగదారులకు వారి టీవీలో డి‌టి‌హెచ్ ఛానెల్స్, వెబ్ సిరీస్ ప్లాట్ ఫార్మ్ ల కంటెంట్ రెండింటినీ చూడటానికి అనుమతిస్తుంది.

ఈ చిన్న డివైజ్  సెట్-టాప్ బాక్స్ అండ్ ఫైర్‌స్టిక్ ల పని చేస్తుంది. స్ట్రీమింగ్ యాప్స్ లో ముందే ప్రీ ఇన్‌స్టాల్ చేసిన  డిస్నీ + హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 మొదలైన వాటితో పాటు మీరు 500పైగా టీవీ ఛానెల్‌లను ప్రసారం చేయవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ 10వేల సినిమాలు, షోస్ కంటెంట్  లైబ్రరీతో వస్తుంది.

మేము స్మార్ట్ డివైజెస్ ట్రెండ్ ని గుర్తించి, ఎయిర్‌టెల్ దీనిపై జాగ్రత్త వహించింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ ఆధారితమైనందున సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చగలదు, యాప్స్ డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ కి అక్సెస్ చేయగలదు, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ తో స్మార్ట్‌ఫోన్‌ల నుండి కంటెంట్  ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. బ్లూటూత్ ఎనేబుల్ తో టీవీలో గేమ్స్ ఆడటానికి మీరు మీ ఫోన్‌ను కంట్రోలర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇది నిజంగా మీ ఖర్చుల సమస్యను పరిష్కరించగలదు. ఇది మీకు చాలా మంచి వార్తా. మీరు ఓ‌టి‌టి  ప్లాట్ ఫార్మ్ ల సబ్ స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ అక్సెస్ ఉచితంగా పొందవచ్చు. అవును, మీరు విన్నది నిజమే.

మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ను తీసుకున్నట్లయితే మీకు ఇవన్నీ ఇప్పుడు ఉచితంగా లభిస్తాయి, ఇది ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. మరో మాటలో చెప్పాలంటే, ఇంటర్నెట్ కనెక్షన్‌తో, మీరు ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్  ఉచితంగా పొందవచ్చు. 2020 సంవత్సరం ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది, కాదా?