యోగా గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించనుంది. ‘ఆర్డర్‌ మీ’ అనే వెబ్ సైట్ ద్వారా రాబోయే 15 రోజుల్లో స్వదేశీ వస్తువులను మాత్రమే విక్రయించడానికి సిద్ధమవుతోంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పై 800కి పైగా పతంజలి ఉత్పత్తులను అందిస్తుందని, భారతీయ ఉత్పత్తులను విక్రయించే ఇతర దుకాణాలకు వినియోగదారుని అనుసంధానిస్తుందని ఇటి నివేదికలో తెలిపింది.

అర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ఉత్పత్తులను కంపెనీ ఉచితంగా పంపిణీ చేయనుంది. వినియోగదారులకు పతంజలి, యోగా ట్యుటోరియల్స్‌కు చెందిన 1,500 మంది వైద్యుల నుండి 24X 7 ఉచిత వైద్య సలహాలను కూడా అందిస్తామని నివేదికలో పేర్కొంది.

ముఖ్యంగా మే 12న దేశంలో  పిఎం నరేంద్ర మోడీ  ఇచ్చిన టెలివిజన్ ప్రసంగంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరిన కొద్ది రోజులకే ఈ చర్య చోటు చేసుకుంది.

also read ఫేస్‌బుక్‌​ మరో భారీ డీల్‌..జిఫీ వెబ్‌సైట్‌ కొనుగోలు.. ...

‘వొకల్  ఫర్ లోకల్’ అనే నినాదంతో, ఖాదీ వంటి దేశంలో తయారయ్యే ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని ఆయన దేశ ప్రజలకి విజ్ఞప్తి చేశారు.

 ఈ కామర్స్ యాప్ ప్లాట్‌ఫామ్ పతంజలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ న్యూ ఢిల్లీకి చెందిన భారువా సొల్యూషన్స్‌లో అభివృద్ధి చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ లకు  అందుబాటులో ఉంటుంది.

"దేశీయ ఉత్పత్తులను సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వారి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో చేరాలనుకునే వారికి ప్రోత్సహించనున్నారు"  అని  పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆచార్య బాల్కృష్ణ నివేదికలో పేర్కొన్నారు.రెండేళ్ల క్రితం పతంజలి ‘స్వదేశీ’ బట్టలతో బ్రాండెడ్ దుస్తులు రంగంలోకి ప్రవేశించింది.

ఆ సమయంలో, సంస్థ తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి పేటియం, ఫ్లిప్ కర్ట్, అమెజాన్, ఐ‌ఎం‌జితో సహా పలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం చేసుకుంది. 45 రకాల కాస్మెటిక్ ఉత్పత్తులు,30 రకాల ఆహార ఉత్పత్తులతో సహా 2,500 కి పైగా ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తుంది.