Asianet News TeluguAsianet News Telugu

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ..: ఒప్పో లైవ్ షో రద్దు..

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’కు భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ఘాటు బాగానే తగిలింది. ఈ ఘర్షణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తుల బహిష్కరణ వేటు మార్మోగుతున్నది. ఈ క్రమంలో ఒప్పో తన స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణకు రూపొందించిన లైవ్ షోను రద్దు చేసుకున్నది.
 

Oppo New Smart Phone Launch event banned In India
Author
Hyderabad, First Published Jun 18, 2020, 11:29 AM IST

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల సెగ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పోకు తగిలింది. డ్రాగన్‌ దుశ్చర్యతో 20 మంది భారత సైన్యం ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ నినాదం మార్మోగుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణను ఒప్పో రద్దు చేసుకున్నది. 

ఫైండ్ ఎక్స్‌2 సిరీస్‌లో రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను దేశీయ మార్కెట్‌కు లైవ్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఒప్పో పరిచయం చేయాలని భావించింది.  అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య ఇది శ్రేయస్కరం కాదని భావించిన సంస్థ.. ఫోన్ల ఆవిష్కరణకు సంబంధించిన ఓ 20 నిమిషాల వీడియోను ముందుగానే చిత్రీకరించి విడుదల చేసింది. 

'ఒప్పో'  ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఫోన్లతో వినియోగ దారులను అకర్షిస్తోంది. ఒప్పో తాజాగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను బుధవారం తీసుకొచ్చింది. ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్‌ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రొ మోడళ్లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్‌ సెరామిక్‌ నలుపు వర్ణంలో ఉంటుందని తెలిపింది.

దేశంలో  ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 2, 12జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.64,900గా ఒప్పో సంస్థ నిర్ణయించింది. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌2 ప్రొ ధరను ఇంకా ప్రకటించలేదు. ఇటీవల అద్భుత ఫీచర్లతో వన్‌ప్లస్‌ 8సిరీస్‌, శ్యామ్‌సాంగ్‌ గ్యాలెక్సీ ఎస్‌ 20 మార్కెట్‌లోకి వచ్చాయి. 

వాటికి దీటుగా అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తాయని ఒప్పో సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా రెండు సిరీస్‌ ఫోన్లకు స్టీరియో స్పీకర్లు ప్రధాన ఆకర్షణని, ఆండ్రాయిడ్‌ 10 సాఫ్ట్‌వేర్‌ను అమర్చామని సంస్థ పేర్కొంది.

ఫైండ్‌ ఎక్స్‌2 ప్రొ మోడల్ ఫోన్ డిస్‌ప్లే 6.70 అంగుళాలు ఉంటుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తోపాటు 865 డిస్‌ప్లే ఉంటుంది. ఇక 32 మెగా పిక్సల్స్‌తో ఫ్రంట్‌ కెమెరా, రేర్‌ కెమెరా 48+48+13 మెగా పిక్సల్స్‌తో లభిస్తుంది.

also read  రిలయన్స్ జియోకు కొత్త కష్టాలు:పెండింగ్‌లో ఫేస్‌బుక్ డీల్‌?!

దీనిలో 12జీబీ  ర్యామ్  విత్ 512జీబీ ర్యామ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. 4260 ఎమ్‌ఎహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 10 ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 

ఫైండ్‌ ఎక్స్‌2 ఫోన్ డిస్‌ప్లే 6.70 అంగుళాలు ఉంటుంది. క్వాల్ కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ డిస్ ప్లేతో కూడిన 865 ప్రాసెసర్, 32 మెగా పిక్సెల్స్‌తో ఫ్రంట్‌ కెమెరా, 48+12+13 మెగా పిక్సెల్స్‌తో రియర్‌ కెమెరా జత చేశారు.

ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్ సామర్థ్యం ఉంటుంది. అలాగే 256జీబీ స్టోరేజ్ వెసులుబాటు కూడా ఉంది. 4200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 10 సేవలు అందుబాటులో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios