చైనా మొబైల్ తయారీ సంస్థ  ఒప్పో ఎట్టకేలకు భారతదేశంలో రెనో4 ఎస్‌ఇని విడుదల చేసింది. ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 21న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఒప్పో  రెనో4 సిరీస్ జూన్ లో ప్రారంభమైంది, రెనో4 ఎస్ఇ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

అయితే, రెనో4 ఎస్‌ఇని రెనో 4 సిరీస్‌లో చేర్చినప్పటికీ దీని డిజైన్ భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన ఎఫ్ 17 ప్రో డిజైన్‌ పోలికతో ఉంటుంది.

 ఒప్పో వచ్చే వారంలో జరిగే ఓ కార్యక్రమంలో రెనో4 ఎస్‌ఇ ధరను ప్రకటించనుంది. రెనో4 ఎస్‌ఇ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,000, 256 జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.32 వేలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఒప్పో రెనో4 ఎస్‌ఇ టీజర్ వీడియోలో చూస్తే  ప్రకాశవంతమైన నీలం (లేదా వైలెట్) రంగులో వచ్చే అవకాశం ఉంది.   

also read నాకు ఈ డీల్ నచ్చలేదు.. సంతకం చేయను: డొనాల్డ్ ట్రంప్ ...

ఒప్పో రెనో4 ఎస్ఇ ఫీచర్స్

ఒప్పో రెనో4 ఎస్‌ఇ 1080పి ఎల్‌ఈ‌డి స్క్రీన్‌ పంచ్-హోల్‌ డిస్ ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. స్క్రీన్ సైజ్ 6.43 అంగుళాలతో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 5 జీ కనెక్టివిటీతో 8 జీబీ ర్యామ్, 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షియాలిటీ 720 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో 48ఎం‌పి + 8ఎం‌పి + 2ఎం‌పి ట్రిపుల్ కెమెరాల సెటప్, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32ఎం‌పి కెమెరా అందించారు. 

 65W వరకు ఛార్జ్ చేయగల 4300 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7.2లో నడుస్తుంది, అయితే ఈ ఏడాది చివర్లో కలర్ ఓఎస్ 11 ద్వారా ఆండ్రాయిడ్ 11లో కూడా లభిస్తుంది. ఫోన్‌లో యుఎస్‌బి-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.