స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో కొత్త ఎఫ్17 సిరీస్‌ను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో ఈ సిరీస్‌లో ఎఫ్ 17, ఎఫ్ 17 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.రెండు స్మార్ట్‌ఫోన్‌లు 30W ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాల సెటప్ తో వస్తుంది. సరికొత్త ఎఫ్17 సిరీస్ గురించి పూర్తి వివరాలు 


ఒప్పో ఎఫ్17, ఎఫ్17ప్రో ధర
ఒప్పో ఎఫ్17ను భారతదేశంలో సింగల్ వెరీఎంట్ 8జి‌బి + 128జి‌బి ధర రూ.22,990 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు ఒప్పో ఎఫ్17 ప్రొ నేవీ బ్లూ, క్లాసిక్ సిల్వర్, డైనమిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు. ప్రో వేరియంట్ సెప్టెంబర్ 7 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. కస్టమర్లు  ఈ రోజు నుంచి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

also read చిప్స్ ప్యాకెట్ కొంటె ఫ్రీ ఇంటర్నెట్.. ఎయిర్‌టెల్ వెరైటీ ఆఫర్.. ...
ఒప్పో ఎఫ్ 17 ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 17లో 6.44-అంగుళాల ఫుల్‌హెచ్‌డి డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్‌, డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ 8జి‌బి ర్యామ్, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 కలర్‌ఓఎస్ 7.2 పై పనిచేస్తుంది. 30W వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చే 4,000mAh బ్యాటరీ ఉంది.

కెమెరాల విషయానికొస్తే ఒప్పో ఎఫ్17 లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ హౌసింగ్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఒప్పో ఎఫ్ 17 ప్రో స్పెసిఫికేషన్స్
ఒప్పో ఎఫ్ 17 ప్రో  6.43-అంగుళాల ఫుల్‌హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి95 ప్రాసెసర్‌, 8జి‌బి ర్యామ్, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్‌, మైక్రో ఎస్‌డి కార్డ్‌ ఆప్షన్, 30W  వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ తో 4,000mAh బ్యాటరీ ఇందులో ఉంది

 ఒప్పో ఎఫ్ 17 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు డ్యూయల్ కెమెరా సెటప్ హౌసింగ్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి.