జోమాటో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇక టేక్-అవే సర్వీస్ ఫ్రీ..

“ మేము మా టేక్‌అవే సేవను మా రెస్టారెంట్ భాగస్వాములకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాము. మేము ఎటువంటి కమీషన్ వసూలు చేయము, అన్ని టేక్-అవే ఆర్డర్‌లపై గేట్‌వే ఛార్జీలను కూడా విరమిస్తున్నట్లు” విపి ప్రొడక్ట్స్ రాహుల్ గంజూ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

online food delivary Zomato announces free takeaway services for restaurants

 ఫుడ్ డెలివరీ దిగ్గజం జోమాటో రెస్టారెంట్ భాగస్వాముల వద్ద లభించే టేక్-అవే సేవలను ఉచితంగా అందింస్తామని ప్రకటించింది. టేక్-అవే సేవలకు ఎటువంటి కమీషన్లు వసూలు చేయబోమని కంపెనీ తెలిపింది.

గత కొన్ని నెలల్లో ఆర్డర్ వాల్యూమ్ 200% కంటే ఎక్కువ పెరగడంతో జోమాటో టేక్-అవే లేదా సెల్ఫ్ పికప్ సర్వీస్ విపరీతమైన వృద్ధిని సాధించిందని కంపెనీ వెల్లడించింది.

“ మేము మా టేక్‌అవే సేవను మా రెస్టారెంట్ భాగస్వాములకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాము. మేము ఎటువంటి కమీషన్ వసూలు చేయము, అన్ని టేక్-అవే ఆర్డర్‌లపై గేట్‌వే ఛార్జీలను కూడా విరమిస్తున్నట్లు” విపి ప్రొడక్ట్స్ రాహుల్ గంజూ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 55,000పైగా రెస్టారెంట్లలో టేక్-అవే  ఉందని, వారానికి పదివేల ఆర్డర్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులు జోమాటో యాప్ లో డెలివరీ లేదా టేక్-అవే ఆప్షన్ ఎంచుకోవచ్చు. జోమాటో యాప్ హోమ్ పేజీలో ఫిల్టర్‌లను ఉపయోగించి టేక్-అవే అందించే అన్ని రెస్టారెంట్ల కోసం వినియోగదారులు సెర్చ్ చేయవచ్చు.

also read బ్యాంక్ కస్టమర్లకు ఎస్‌బి‌ఐ వార్నింగ్.. సోషల్ మీడియాలో నకిలీ పోస్టులపై అలర్ట్.. ...

టేక్-అవే సర్వీస్ ఉచితం చేసిన తరువాత ప్రజలు ఇప్పుడు ఇంట్లో వండిన ఆహారంతో విసుగు చెందిన వారు రెస్టారెంట్ ఆహారాన్ని సురక్షితమైన, సౌకర్యవంతమైన టేక్-అవే ఆప్షన్ తో తినడం ప్రారంభిస్తారు అని కంపెనీ అభిప్రాయపడింది.

ఇప్పటికే ఆర్డర్‌లను డెలివరీ అందించే రెస్టారెంట్లు టేక్‌-అవే ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను యాక్సెస్ చేయడానికి, వారి వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి మరొక మార్గాన్ని అందిస్తుంది" అని గంజూ బ్లాగులో చెప్పారు.

కరోనావైరస్ కారణంగా విధించిన ఆంక్షల కారణంగా ఫుడ్ సప్లయ్ వ్యాపారం చాలా ప్రభావితమైన పరిశ్రమలలో ఒకటి. స్విగ్గి, జోమాటోతో సహా యాప్స్ ఆదాయం లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది.  

లాక్ డౌన్ ఎత్తివేసినప్పటి నుండి ఫుడ్ సప్లయ్ యాప్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయి. డబల్యూ‌హెచ్‌ఓ కూడా ఫుడ్ డెలివరీ సురక్షితం అని, ప్రజలు ఫుడ్ ప్యాకేజింగ్ గురించి భయపడకూడదని చెప్పారు.

"మార్చిలో మొదటి  లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మేము 13 కోట్లకు పైగా ఆర్డర్లు అందించము, ఆహారం లేదా దాని ప్యాకేజింగ్ ద్వారా కోవిడ్ ట్రాన్స్మిషన్ కేసులు సున్నాగా నివేదించబడ్డాయి. ఆహార సర్వీస్ పరిశ్రమ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ప్రీ-కోవిడ్ స్థాయికి తిరిగి రావడానికి ఈ రంగానికి ఇంకా సహాయం అవసరం”అని గంజూ చెప్పారు.

జోమాటో రెస్టారెంట్ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది, తద్వారా వారు అన్ని భద్రతా నిబంధనలను అనుసరిస్తారు. వినియోగదారులు తమ ఆర్డర్‌లను తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టె ముందు మస్కూలు ధరించాలని కంపెనీ కోరింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios