Asianet News TeluguAsianet News Telugu

వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ : ముందు భారత్, యూరప్‌లోనే.. ధరెంతంటే?

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ కొన్ని నెలల విరామం తర్వాత ఊహాగానాలకు తెర దించింది. త్వరలో సరసమైన ధరకు నోర్డ్ ఫోన్ విడుదల చేస్తామని, తొలుత, భారత్, యూరప్ దేశాల్లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర 500 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord Announced Officially, Pricing Teased to Be Under $500
Author
Hyderabad, First Published Jul 1, 2020, 12:52 PM IST

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ కొన్ని నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించింది. తమ సంస్థ నుంచి వస్తున్న అతి సరసమైన ధరలో దొరికే వన్‌ప్లస్‌ నార్డ్‌ ఫోన్‌ను తొలుత భారత్, యూరప్ దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ శ్రేణి తమ సంస్థ కొత్త గ్లోబల్‌ బిజినెస్‌ స్ట్రాటజీని అనుసరిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా అందుబాటు ధరల్లో మరికొన్ని ఫోన్లను తీసుకొస్తామని వివరించింది. అలాగే, దీనికి సంబంధించి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకుంటామని వన్ ప్లస్ తెలిపింది. 

‘ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ శ్రేణిని ప్రారంభించడం తమ కంపెనీ చరిత్రలోనే కొత్త అధ్యయానికి నాంది పలికింది. ప్రపంచానికి మంచి సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇది మాకు చాలెంజింగ్‌తో కూడుకున్న పని’ అని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో పీట్‌ లా పేర్కొన్నారు. 

‘మా ప్రధాన ఉత్పత్తుల గురించి మేం చాలా గర్వపడుతున్నాం. ఈ కొత్త ఉత్పత్తి శ్రేణి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ మంది వినియోగదారులతో వన్‌ప్లస్ అనుభవాన్ని పంచుకోబోతున్నందుకు సంతోషిస్తున్నాం.’ అని పీట్ లా వ్యాఖ్యానించారు. 

also read  ‘5జీ’ పై కేంద్రం కీలక నిర్ణయం..? అదే జరిగితే ‘5జీ’ సేవలుకు బ్రేక్..?!

ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన తర్వాత ఉత్తర అమెరికాలో అత్యంత పరిమితమైన బీటా ప్రోగ్రామ్ ద్వారా దీన్ని వాడే అవకాశం కొంతమందికి లభిస్తుందని పీట్ ా తెలిపారు. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ అప్‌డేట్‌ కోసం భారతీయులు అమెజాన్‌.ఇన్‌లో లాగిన్‌ అయి నోటిఫై మీ బటన్‌ను క్లిక్‌ చేయాలని సూచించారు.  

‘గూగుల్‌ ఫొటోస్‌’లో ఆటో బ్యాకప్‌ అవుట్‌!
టెక్‌ కంపెనీ గూగుల్‌ ఆటో బ్యాకప్‌ ఆప్షన్‌కు స్వస్తి పలికింది. వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి చాట్‌ యాప్స్‌లో గూగుల్ ఫొటోలకు ఇకపై మీడియాను బ్యాకప్ చేయబోమని ప్రకటించింది. దీన్ని గతనెలలో పరీక్షంచిన ఆ కంపెనీ, ఇప్పుడు దీన్ని అన్ని గూగుల్‌ ఫొటోస్‌ వినియోగదారులకు వర్తింజేస్తున్నది. 

ఇందుకోసం గూగుల్‌ ఫోటోస్‌లో డీఫాల్ట్‌ సెట్టింగ్స్‌ను మార్చింది. ఇంతకుముందు మొబైల్‌లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌లో ఆటో సేవ్‌ అయ్యేవి. అలాగే, ఫోన్‌ కెమెరాతో తీసిన, ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన, వివిధ మెసేజింగ్‌, సోషల్‌ మీడియా యాప్‌లనుంచి తీసుకున్న చిత్రాలు కూడా బ్యాకప్‌ అయ్యేవి. 

Follow Us:
Download App:
  • android
  • ios