గత నెలలో వన్ ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసినా కొద్ది రోజులకే వన్ ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలు వన్‌ప్లస్ 9పై రూమర్లు వ్యాపించాయి. వచ్చే ఏడాది మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ తీసుకువస్తునట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

 వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8టి లాగానే నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ 9 ఫోన్ హోల్ -పంచ్ డిస్ప్లేతో వస్తుందని ఒక వార్తా చూపిస్తుంది. వన్‌ప్లస్ 9 వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మార్చి మధ్యలో ఎప్పుడైనా లాంచ్ కావొచ్చని పుకార్లు  వినిపిస్తున్నాయి.

సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా వన్ ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ లాగానే ఉండనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ కొంచెం పెద్ద 6.55-ఇంచ్ గల  డిస్ ప్లే ప్యానెల్ ఉంటుంది. 

వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8టి మోడళ్ లాగానే హోల్-పంచ్ డిస్ ప్లే డిజైన్ ని హైలైట్ చేస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తుంది. కెమెరా సెన్సార్ల పక్కన ఎల్‌ఈ‌డి ఫ్లాష్ కూడా ఉంది.

also read త్వరలో ఇండియాలోకి పబ్-జితో పాటు రీఎంట్రీ ఇవ్వనున్న టిక్ టాక్.. ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా హామీ.. ...

క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్న వన్‌ప్లస్ 8టితో పోల్చితే వన్‌ప్లస్ 9 వెనుక భాగంలో తక్కువ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్ ప్లస్ 8 సిరీస్‌ లాగానే వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో అనే రెండు మోడళ్లు రానున్నాయి. వన్‌ప్లస్ 9 లో వన్‌ప్లస్ వార్నింగ్ స్లయిడర్, వాల్యూమ్ రాకర్‌ ఊన్నట్లు కనిపిస్తుంది.  

వన్‌ప్లస్ 9 ఫీచర్స్ 
వన్‌ప్లస్ 9  120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 SoC ,  65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుందని ఊహిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్ ఓఎస్, 8 జీబీ ర్యామ్‌తో  రానున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ సింగిల్-కోర్ స్కోరు 1,122, మల్టీ-కోర్ స్కోరు 2,733. వన్‌ప్లస్ 9 గురించి వన్‌ప్లస్ సంస్థ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు.