బెంగళూరు: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ గొప్ప ఆఫర్ ప్రకటించింది. వన్ ప్లస్ 7టీను లాంచ్ చేసి సంవత్సరం పూర్తయింది.

తాజాగా వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8టీ వచ్చాక కూడా వన్ ప్లస్ 7టీ స్మార్ట్ ఫోన్ పర్ఫర్మెంస్ బాగుందని, బెస్ట్ ఫోన్ అని వినిపిస్తున్నాయి. వన్ ప్లస్ 7టీ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందని, అద్భుతమైన స్క్రీన్ తో పాటూ మంచి కెమెరాలు, డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయని వినియోగదారులు చెప్పుకొచ్చారు.

అయితే ఈ మొబైల్ ను రూ.32,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్ సైట్ ఈ ఆఫర్ ను అందిస్తున్నది.

also read నన్ను, నా కుటుంబాన్ని రెస్టారెంట్ నుండి అన్యాయంగా పంపించేశారు : అనన్య బిర్లా ...

అంతేకాకుండా వన్ ప్లస్ పాత ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే మరింత తక్కువ ధరకే లభించనుంది. వన్ ప్లస్ 7టీ 256 జీబీ వేరియంట్ ధర రూ.37,999లకు అమెజాన్ లో ఉంచారు.

యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులను ఉపయోగించడం ద్వారా ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది. తక్కువ ధరకే మంచి మొబైల్ కావాలని చూస్తున్న వారికి ఈ మొబైల్ బెస్ట్ ఫోన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

రూ.30 వేలలో లభించే బెస్ట్ ఫోన్ ఇదే అని కూడా  చెబుతున్నారు. వన్ ప్లస్ 7టీ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంది, వన్ ప్లస్ 8టీలో 8జీబీ ర్యామ్ అందించారు.