మొబైల్ తయారీలో సంచలనం సృష్టించిన నోకియా బ్రాండ్ కొత్తగా 4జి‌ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. నోకియా 215 4జి, నోకియా 225 4జి ఫీచర్ ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త నోకియా ఫోన్లు 4జి వి‌ఓ‌ఎల్‌టి‌ఈ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

ఇందులో వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో కూడా ఉంది. ఫీచర్ ఫోన్‌లలో డెడికేటెడ్ ఫంక్షన్ కీలు కూడా ఉన్నాయి. ఒకే ఛార్జీపై 24 రోజుల స్టాండ్‌బై అందిస్తుంది. నోకియా 225 4జి వెనుకవైపు కెమెరాను కూడా అందించారు, వినియోగదారులు ప్రయాణంలో ఉన్నప్పుడు వారి జ్ఞాపకాలను ఫోటోలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

నోకియా 225 4జి, నోకియా 215 4జి రెండూ  30ప్లస్ ఓఎస్‌ పై  పనిచేస్తాయి. ఈ ఫోన్లను మొదట చైనాలో ప్రారంభించారు.

భారతదేశంలో నోకియా 215 4జి, నోకియా 225 4జి ధర
భారతదేశంలో నోకియా 215 4జి ధర రూ.2,949 కాగా, నోకియా 225 4జి ధర రూ.3,499. నోకియా 215 4జి ఫోన్  బ్లాక్, సియాన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. నోకియా 225 4జి ఫోన్ బ్లాక్, క్లాసిక్ బ్లూ, మెటాలిక్ సాండ్ షేడ్స్‌లో అందిస్తున్నారు.

also read ఇండియా కంటే అక్కడే ఆపిల్ ఐఫోన్‌ ధరలు చాలా తక్కువ.. ఎంతంటే ? ...

నోకియా 215 4జి, నోకియా 225 4జి ఫోన్లు అక్టోబర్ 23 శుక్రవారం నుండి నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది, ఆఫ్‌లైన్ రిటైలర్లలో నవంబర్ 6 నుండి సేల్స్  ప్రారంభమవుతాయి. నోకియా 225 4జి కూడా శుక్రవారం నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది.

నోకియా 215 4జి, నోకియా 225 4జి స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో), రెండూ సిరీస్ 30ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఆర్‌టి‌ఓ‌ఎస్ లో నడుస్తాయి, 2.4-అంగుళాల క్యూ‌వి‌జి‌ఏ డిస్ ప్లేతో వస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్  ద్వారా 32 జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది.

128ఎం‌బి ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్‌లలో వస్తుంది. కనెక్టివిటీ పరంగా  వి‌ఓ‌ఎల్‌టి‌ఈ, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో-యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ప్రీ ఇన్‌స్టాల్ చేసిన ఎమ్‌పి 3 ప్లేయర్‌తో వస్తాయి.

ఈ రెండింటిలోనూ 1,150 ఎంఏహెచ్ రీమివబుల్ బ్యాటరీని అందించింది. రెండు ఫోన్లలో తేడాల గురించి చెప్పాలంటే నోకియా 225 4జి వెనుకవైపు 0.3-మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇది వి‌జి‌ఏ రిజల్యూషన్‌లో ఫోటోలు, వీడియోలను తీసుకోవడానికి అనుమతిస్తుంది.

కానీ నోకియా 215 4జిలో కెమెరా అందించలేదు. బరువు విషయానికొస్తే నోకియా 215 4జి 90.3 గ్రాములు ఉండగా, నోకియా 225 4జి బరువు 90.1 గ్రాములు ఉంటుంది.