ఫేస్‌బుక్ లాంటి యాప్‌లపై నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్

భారతదేశ టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ద్వారా ఉచిత వాయిస్, టెక్స్ట్ సేవలను అందించే యాప్స్ నియంత్రణ కోసం చాలాకాలంగా లాబీయింగ్ చేస్తున్నాయి, అలాంటి సేవలు వల్ల తమ ఆదాయాన్ని కోల్పోతున్నామని వాదించాయి. 

no regulations needed for OTT communication apps like Facebook says TRAI

సోషల్ మీడియా దిగ్గజా సంస్థలు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై సంభావ్య పరిమితుల ముప్పును పక్కనబెట్టి ఓవర్-ది-టాప్ (ఒటిటి) కమ్యూనికేషన్ సేవలకు ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అవసరం లేదని భారత టెలికాం వాచ్‌డాగ్ సోమవారం తెలిపింది.

భారతదేశ టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ద్వారా ఉచిత వాయిస్, టెక్స్ట్ సేవలను అందించే యాప్స్ నియంత్రణ కోసం చాలాకాలంగా లాబీయింగ్ చేస్తున్నాయి, అలాంటి సేవలు వల్ల తమ ఆదాయాన్ని కోల్పోతున్నామని వాదించాయి.

"ప్రస్తుతం సూచించిన చట్టాలు నిబంధనలకు మించి ఓ‌టి‌టి సేవల వివిధ అంశాల కోసం సమగ్ర నియంత్రణ చట్రాన్ని సిఫారసు చేయడానికి ఇది సరైన సందర్భం కాదు" అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక ప్రకటనలో తెలిపింది.

also read లైవ్ ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం జియో కొత్త క్రికెట్ ప్లాన్స్.. ...

ఒటిటి సేవల గోప్యత, భద్రతకు సంబంధించిన సమస్యలపై నియంత్రణ జోక్యం అవసరం లేదని ట్రాయ్ తెలిపింది. అయితే ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ దీనిపై స్పందించల్స్సీ ఉంది. ట్రాయ్ నిర్ణయాన్ని నెట్ న్యూట్రాలిటీ కార్యకర్తలు స్వాగతించారు.

అయితే టెలికాం పరిశ్రమ లాబీ గ్రూప్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి‌ఓ‌ఏ‌ఐ), టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టి‌ఎస్‌పిలు), రెగ్యులేటరీ అసమతుల్యత, నాన్-లెవల్ ప్లే ఫీల్డ్ వంటి సమస్యలను ట్రాయ్ పరిష్కరించలేదని, ఇది టీఎస్‌పీలకు నష్టదాయకమని కోయ్ డైరెక్టర్ జనరల్ ఆరోపించారు.

"ఈ సమస్యల పరిష్కారం లేకుండా టి‌ఎస్‌పిలు ఒటిటి కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ తో అననుకూల స్థితిలో కొనసాగుతాయి" అని సి‌ఓ‌ఏ‌ఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios