వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా..!
వాట్సాప్ చాట్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. దీని వల్ల మెసేజెస్ చూసుకోవడం మరింత సులభతరం కానుంది. డబల్యూఏ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ యాప్ లో త్వరలోనే డేట్ ద్వారా మెసేజెస్ చూసుకోవడానికి సహాయపడుతుంది.
సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఇప్పుడు చాట్ ప్లాట్‌ఫామ్ కోసం ఒక కొత్త ఫీచర్ ను తీసుకురావలని చూస్తుంది. సాధారణంగా చాట్ చేశాక పాత మెసేజెస్ కోసం పైకి స్క్రోల్ చేస్తుంటాం అలా కాకుండా ఇప్పుడు మరింత సులభంగా మెసేజెస్ సెర్చ్ కోసం ఒక కొత్త ఆలోచన చేసింది.
ఈ ఫీచర్ వల్ల చాట్ లో డేట్ ఎంటర్ చేసి ఆ రోజు చాట్ మెసేజులను చూసుకోవచ్చు. డబల్యూఏ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆల్ఫా దశలో ఉందని, ఈ కొత్త సెర్చ్ ఫిల్టర్ లాంచ్ తేదీపై సమాచారం లేదని ఒక నివేదిక పేర్కొంది.
అయితే ‘సెర్చ్ బై డేట్ ’ ఫీచర్ క్యాలెండర్ గుర్తుతో ఉంటుంది. ఇది పాత మెసేజెస్ సులభంగా చూడడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం, వాట్సాప్‌లోని సెర్చ్ ఫీచర్ వినియోగదారులను వారి చాట్‌లో ప్రత్యేకమైన కంటెంట్ కోసం చూడటానికి అనుమతిస్తుంది.
also read జియో అమేజింగ్ ఆఫర్.. ఏడాది పాటు అమెజాన్ ప్రైం ప్రీ..
యాప్ వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో మల్టీ లాగిన్ డివైజ్ సపోర్ట్, సెర్చ్ బై డేట్ ఆప్షన్ ఇలా పలు ఫీచర్లు ఉన్నాయి. వీటి వలన వాట్సాప్ వాడకాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలన్న ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మల్టీ లాగిన్ డివైజ్ సపోర్ట్ ఫీచర్ వలన ఒకేసారి వివిధ డివైజ్‌లలో వాట్సాప్‌ని లాగిన్ అవ్వొచ్చు. ప్రస్తుతం ఒక చోట లాగిన్ అయ్యి మరొకరు లాగిన్ అవ్వాలంటే కచ్చితంగా లాగ్ ఔట్ అవ్వాల్సి ఉండగా మల్టీ లాగిన్ డివైజ్ వలన ఆ ఇబ్బంది తొలగనుంది.
అలాగే వివిధ డివైజ్‌ల నుంచి ఒకే సమయంలో చాట్ చేసే అవకాశం ఉంటుంది. పలువురు కలిసి పని చేసుకునే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పోయింటర్ ఇన్స్టిట్యూట్ యూనిట్ ఇంటర్నేషనల్ ఫాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్, కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్ కోసం గ్లోబల్ చాట్‌బాట్ హిందీ వెర్షన్‌ను విడుదల చేసింది.