Asianet News TeluguAsianet News Telugu

నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ-ట్రయల్ ఆఫర్‌.. వారం రోజులపాటు ఆన్ లిమిటెడ్ కంటెంట్ అక్సెస్..

ఈ ఫ్రీ ట్రయల్‌  మొదట ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తరువాత ప్రపంచ దేశాలలో తీసుకొచ్చేందుకు  నెట్‌ఫ్లిక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ మంగళవారం వెల్లడించారు.
 

Netflix to Offer Free Trial of Its Service for a Weekend That Will Begin in India-sak
Author
Hyderabad, First Published Oct 22, 2020, 3:59 PM IST

అమెరికన్ టెక్నాలజీ అండ్ మీడియా సర్వీసెస్ ప్రొవైడర్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్  రెండు రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ను దేశంలోని ప్రతిఒక్కరికీ అందించాలని యోచిస్తోంది. ఈ ఫ్రీ ట్రయల్‌  మొదట ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తరువాత ప్రపంచ దేశాలలో తీసుకొచ్చేందుకు  నెట్‌ఫ్లిక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ మంగళవారం వెల్లడించారు.

నెట్‌ఫ్లిక్స్ ఇంతకుముందు 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ అందించింది, కొత్త వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్   సర్వీస్ పరీక్షించడానికి, సబ్ స్క్రిప్షన్ పొందే ముందు కొన్ని వెబ్ సిరీస్‌లను చూడటానికి అనుమతించింది.

తరువాత ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ సబ్ స్క్రిప్షన్ ఆఫర్ తీసివేసినట్లు కనిపిస్తోంది.“దేశంలోని ప్రతిఒక్కరికీ నెట్‌ఫ్లిక్స్‌  ఫ్రీ అక్సెస్ ఇవ్వడం అనేది మా సర్వీస్ ఎలా పనిచేస్తుందో, కొత్త వ్యక్తుల సమూహాన్ని బహిర్గతం చేయడానికి గొప్ప మార్గం అని అనుకుంటున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో గ్రెగ్ పీటర్స్ అన్నారు.  

"కొత్త సభ్యులను ఆకర్షించడానికి, వారికి గొప్ప నెట్‌ఫ్లిక్స్ అనుభవాన్ని అందించడానికి మేము ఎల్లప్పుడూ కొత్త మార్కెటింగ్ ప్రమోషన్లను చేస్తున్నాము" అని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఫ్రీ ట్రయల్‌ సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

also read సరికొత్త రిలయన్స్ ‘జియోపేజెస్‌’ మొబైల్‌ బ్రౌజర్‌.. 8 భారతీయ భాషల్లో అందుబాటులోకి... ...

నెట్‌ఫ్లిక్స్ తరచుగా మల్టీ ఫీచర్స్, ప్రోమోషనల్ ఆఫర్‌ల టెస్టింగ్ నిర్వహిస్తుంది. ఇది వ్యూవర్స్ అవసరాలను అర్థం చేసుకోవడానికి, తగిన అప్ డేట్స్ చేయడానికి సహాయపడుతుంది.

 ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విభిన్న ప్రోమోషనల్ కార్యక్రమాలను నడుపుతుంది. అందువల్ల, కొత్త ఫ్రీ ట్రయల్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండకపోవచ్చు దీనికి బదులుగా భారతదేశంలో  టెస్టింగ్ తర్వాత కొన్ని దేశాలకే పరిమితం అవుతుంది.
    
ఒక విధంగా చెప్పాలంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడటానికి నెట్‌ఫ్లిక్స్‌కు ప్రమోషన్ అవసరం, అలాగే సెప్టెంబర్ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్లకు పైగా సబ్ స్క్రిప్షన్ మార్కును తాకినప్పటికీ, జూన్ 30 నాటికి 19.29 కోట్ల మంది సభ్యుల నుండి ఇది పెరిగింది. అయితే, మూడవ త్రైమాసికంలో 25 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్స్ చేరినట్లు కంపెనీ అంచనా వేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios