4 సంవత్సరాల తరువాత ఇండియన్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్..
నెట్‌ఫ్లిక్స్ లోని ప్రతి భాగం సైన్-అప్, సినిమా పేర్లు, సేర్చ్, పేమెంట్ తో సహా ఇప్పుడు అన్ని యాప్స్, డివైజెస్, మొబైల్, కంప్యూటర్లు లేదా టీవీలో హిందీ భాషలో కూడా అందుబాటులో వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ చివరకు మొదటి లోకల్ వేర్షన్ యూసర్ ఇంటర్‌ఫేస్ హిందీలో ప్రవేశపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ప్రారంభించిన నాలుగున్నర సంవత్సరాల తరువాత హిందీ లాంగ్వేజ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ లోని ప్రతి భాగం సైన్-అప్, సినిమా పేర్లు, సేర్చ్, పేమెంట్ తో సహా ఇప్పుడు అన్ని యాప్స్, డివైజెస్, మొబైల్, కంప్యూటర్లు లేదా టీవీలో హిందీ భాషలో కూడా అందుబాటులో వచ్చింది.
లాంగ్వేజ్ మార్చడం కోసం నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లో మేనేజ్ ప్రొఫైల్స్> లాంగ్వేజ్ కింద మీరు హిందీ బాషకి మారవచ్చు. ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఉపయోగించే యూసర్ లాంగ్వేజ్ మార్చేస్తే అదే అక్కౌంట్ వాడే ఇతర యూసర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
"నెట్‌ఫ్లిక్స్ గొప్ప అనుభవాన్ని అందించడం, గొప్ప కంటెంట్‌ను సృష్టించడం మాకు చాలా ముఖ్యం. కొత్త యూసర్ ఇంటర్‌ఫేస్ నెట్‌ఫ్లిక్స్‌ను మరింత అక్సెస్ చేయగలదని, హిందీ బాషని ఇష్టపడే వారిని మరింత ఆకట్టుకుంటుందని మేము నమ్ముతున్నాము." అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ విపి మోనికా షెర్గిల్ ఒక మెయిల్ ప్రకటనలో తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ హిందీ-లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ భారతదేశంలోని సభ్యులకు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అని స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ గుర్తు చేసింది, ఇతర 26 భాషల మాదిరిగానే భాస ఇండోనేషియా, చైనీస్, చెక్, డానిష్, డచ్, ఇంగ్లీష్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హిబ్రూ, హంగేరియన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, నార్వేజియన్, పోలిష్, పోర్చుగీస్, రొమేనియన్, స్పానిష్, స్వాహిలి, స్వీడిష్, థాయ్, టర్కిష్, వియత్నామీస్.
భారతదేశంలో ప్రాముఖ్యత ఇచ్చిన మొదటి భారతీయ భాష హిందీ అని అర్ధమైంది, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఇప్పుడు లోకల్ -లాంగ్వేజ్ హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి, వీటిలో సేక్రేడ్ గేమ్స్, ఢీల్లీ క్రైమ్, చొక్డ్ వంటివి ఉన్నాయి.