ట్రిపుల్ రియర్ కెమెరాతో మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్..

లెనోవా సంస్థ మోటరోలా వన్ విజన్ స్మార్ట్ ఫోన్ ని మోటరోలా వన్ సిరీస్‌కు కొత్తగా చేర్చింది. కొత్త మోటరోలా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665, ట్రిపుల్ రియర్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో క్ వస్తుంది. ఇందులో సెల్ఫీల కోసం 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Motorola One Vision Plus has made its debut in the Middle East

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా కొత్త వన్ విజన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ని మొట్టమొదటిగా మిడిల్ ఈస్ట్‌ నగరంలో అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లుక్స్, స్పెసిఫికేషన్లు గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో లాంచ్ అయిన మోటో జి8 ప్లస్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది.

లెనోవా సంస్థ మోటరోలా వన్ విజన్ స్మార్ట్ ఫోన్ ని మోటరోలా వన్ సిరీస్‌కు కొత్తగా చేర్చింది. కొత్త మోటరోలా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665, ట్రిపుల్ రియర్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో క్ వస్తుంది. ఇందులో సెల్ఫీల కోసం 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.


మోటరోలా వన్ విజన్ ప్లస్ ధర
ప్రస్తుతం, మోటరోలా వన్ విజన్ ప్లస్ మోటరోలా మిడిల్ ఈస్ట్ వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. అమెజాన్ యుఎఇ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 4జి‌బి + 128జి‌బి స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ. 14,300 ఉంది. దీని కలర్ ఆప్షన్స్ లో కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ ఉన్నాయి.

also read టిక్‌టాక్ యాప్‌ డిలేట్ చేయండి అంటూ ఇమెయిల్.. పొరపాటు అని క్లారీటి.. ...

మోటరోలా వన్ విజన్ ప్లస్ ఫీచర్స్ 
మోటో జి8 ప్లస్ లాగానే డ్యూయల్ సిమ్ (నానో) మోటరోలా వన్ విజన్ ప్లస్ ఆండ్రాయిడ్ 9పై పనిచేస్తుంది. 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1,080x2,280 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665, 4జి‌బి ర్యామ్, 128జి‌బి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్  ద్వారా 512జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది.

మోటరోలా వన్ విజన్ ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.79 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ యాక్షన్ కెమెరా, 117-డిగ్రీల వ్యూ, చివరగా 5 మెగాపిక్సెల్ f / 2.2 ఎపర్చర్‌తో సెన్సార్. సెల్ఫీల కోసం ఫ్రంట్ ప్యానెల్‌లోని వాటర్‌డ్రాప్-నాచ్ ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 25 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది.

ఆన్ బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఫింగర్ ప్రింట్ రీడర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. చివరగా, మోటరోలా వన్ విజన్ ప్లస్ 158.35x75.83x9.09 ఎం‌ఎం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios