ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవా యజమాన్యంలోని మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో నేడు విడుదల చేసింది. ఇ-రిటైలర్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా లాంచ్ సంబంధించి చాలా రోజులుగా టీజ్ చేస్తున్నాయి.

మోటరోలా మోటో జి9ను  ఆగస్టు 24న ఆవిష్కరించబోతుట్లు అధికారికంగా వెల్లడించింది. మోటోరోలా   మోటో జి9 ఫోన్‌ను మాత్రమే విడుదల చేస్తుందా లేదా మోటో జి9 ప్లస్, మోటో జి9 ప్లే వంటి ఇతర జీ 9 సిరీస్‌ ఫోన్‌లను ఆవిష్కరిస్తుందా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ఆగస్టు 24న మధ్యాహ్నం 12 గంటలకు   కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తామని మోటోరోలా టీజ్ చేసింది.    తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా లాంచ్ చేయనున్నామని కంపెనీ ట్వీట్ చేసింది.

also read వాట్సాప్ కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్.. ...
మోటో జి9 లాంచ్ 
ఆగస్టు 24న మధ్యాహ్నం 12 గంటలకు అంటే నేడు కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తానని మోటరోలా తెలిపింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తుంది.

మోటో జి9 ఫీచర్స్ 
 మోటరోలా మోటో జి9 ఫీచర్స్ పై పుకార్లు చాలా వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌లోని టీజర్ పేజీ ప్రకారం మోటో జి9 అద్భుతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా, భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. భారీ బ్యాటరీ కోసం కనీసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు సూచిస్తుంది. టీజర్ పేజీలో ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఉన్నట్లు పేర్కొంది, తక్కువ లైట్ లో కూడా ఫోన్ మంచి ఫోటోలను తీయగలదని ఫ్లిప్‌కార్ట్ పేజ్ లో టీజ్ చేసింది. ఫోన్‌ వాటర్‌డ్రాప్-స్టల్ లో వస్తుంది.