ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియన్ యాప్ షేర్‌చాట్‌లో 100 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. మైక్రోసాఫ్ట్ చైనా యాప్ టిక్‌టాక్ కొనుగోలు చర్చల మధ్య సత్య నాదెల్లా సి‌ఈ‌ఓగా వ్యవహరిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషా సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్‌లో సుమారు 100 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది.

ఈ విషయం తెలిసిన కొందరు వ్యక్తులు పెట్టుబడి చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు. దేశంలో 140 మిలియన్లకు పైగా నెలవారీ ఆక్టివ్ యూసర్లు ఉన్నట్లు షేర్‌చాట్‌ తెలిపింది. ఈ యాప్ హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, అస్సామీ, హర్యన్వి, రాజస్థానీ, భోజ్‌పురి, ఉర్దూలతో సహా 15 భాషల్లో ఉంది.

also read అండమాన్ దీవులలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4జి’ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్.. ...

బెంగళూరు ఆధారిత ప్రాంతీయ భాషా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ గా షేర్‌చాట్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. టిక్‌టాక్ కు పోటీగా బీటా వెర్షన్ లో విడుదలైన షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ మోజ్ యాప్ వారంలోనే గూగుల్ ప్లే స్టోర్ లో  ఐదు మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటిందని షేర్‌చాట్ గత నెలలో తెలిపింది.

షేర్‌చాట్‌ ఆక్టివ్ యూసర్లలలో ఎక్కువ భాగం టైర్ -2, టైర్ -3 నగరాలకు చెందినవారు ఉండగా, వీరిలో ఎక్కువ మంది 2జి నెట్‌వర్క్‌లపై ఆధారపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ చైనా షార్ట్-వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ కార్యకలాపాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ఈ విషయం వెల్లడైంది.

టిక్‌టాక్ యాప్ ను భారతదేశ ప్రభుత్వం గతనెలలో నిషేదించిన విషయం తెలిసిందే. ఒక వార్తా పత్రిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ అధికారికంగా ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని టిక్‌టాక్ కార్యకలాపాలను "50 బిలియన్ డాలర్లకు" కొనుగోలు చేయాలని చూస్తుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ, యు.ఎస్ ప్రెసిడెంట్ మధ్య జరిగిన చర్చలలో సెప్టెంబర్ 15లోగా టిక్‌టాక్ తో ఒప్పందం ముగియాలని నిర్ణయించింది.