Asianet News TeluguAsianet News Telugu

మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి టిక్‌టాక్‌ యాప్.. కొనుగోలుకు బైట్‌డ్యాన్స్‌తో చర్చలు..

 వచ్చే నెల మధ్యలో యుఎస్‌లోని చైనా కంపెనీ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు యుఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆదివారం ధృవీకరించింది. 

Microsoft is planning  to takeover TikTok aap
Author
Hyderabad, First Published Aug 4, 2020, 11:18 AM IST

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ షార్ట్ వీడియో-ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వచ్చే నెల మధ్యలో యుఎస్‌లోని చైనా కంపెనీ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు యుఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆదివారం ధృవీకరించింది.

యు.ఎస్‌లో టిక్‌టాక్‌ సర్వీస్ లను   కొనుగోలు చేయడానికి  చైనా యజమాన్యం బైట్ డాన్స్‌తో చర్చలు జరుపుతున్నాట్లు, సెప్టెంబర్‌ 15 నాటికి ఈ చర్చలు ముగిసే అవకాశం ఉందని వివరించింది. యుఎస్ఎలో యూజర్ డేటా భద్రత ఉండేలా చూసుకోవడం ద్వారా ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడి నిషేధాన్ని నిలిపివేయవచ్చు.  

మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌నకు సంబంధించిన భద్రత, సెన్సార్‌షిప్‌ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కూడా చర్చించినట్లు కంపెనీ పేర్కొంది.

also read వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ యూసర్ల కోసం 138 కొత్త ఎమోజీలు.. ...

యుఎస్ ప్రెసిడెంట్  అమెరికన్ యూసర్ల డేటాను బీజింగ్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి చేరవేస్తుందని ఆరోపణలతో మా అధ్యక్షుడు ట్రంప్ టిక్‌టాక్‌ను నిషేధిస్తానంటూ వ్యాఖ్యానించారు.

2017లో బైట్‌డ్యాన్స్‌ సంస్థ ప్రారంభించిన షార్ట్ వీడియో సర్వీస్ టిక్‌టాక్‌ యాప్  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. భారత చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న వివాదం, భారతీయ యూసర్ల డాటా భద్రత, తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో ఇండియా టిక్‌టాక్‌ను  గతనెలలో నిషేదించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios