మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కు ఇక గుడ్ బై.. ?
ఒక బ్లాగ్ ప్రకారం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నవంబర్ 30, 2020 నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 కి సపోర్ట్ ఆపివేయనుంది. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్‌లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఇ) సేవలు నిలిపివేస్తుందని ఆగస్టు 17న ప్రకటించింది. ఒక బ్లాగ్ ప్రకారం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నవంబర్ 30, 2020 నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 కి సపోర్ట్ ఆపివేయనుంది.
2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్‌లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత నుంచి తమ టీమ్ కూడా అందుబాటులో ఉండదని ఇటీవల వెల్లడించింది.
మార్చి 9, 2021 తరువాతనుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటుందనితెలిపింది.
also read ఈ ఫోన్ తో హార్ట్‌రేట్, బీపీ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...
మైక్రోసాఫ్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ మాదిరిగానే ఉండే కొత్త బ్రౌజర్ వేగంగా, సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొత్త ఎడ్జ్ బ్రౌజర్ మంచి ఆన్‌లైన్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ 365 బ్లాగ్ వివరించింది.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్, 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గా నిలిచింది.
ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల పెరుగుదలతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తన ఆధిపత్యాన్ని కోల్పోవడం ప్రారంభించిందని బిబిసి 2010లో నివేదించింది.