చైనాకు పోటీగా భారతీయ మార్కెట్లోకి మైక్రోమాక్స్ 'ఇన్’ సిరీస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు..
ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్ చైనా బ్రాండ్లకు గట్టి పోటీగా కనిపిస్తుంది. ఈ రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లను 'ఇన్’ సిరీస్‌లో లాంచ్ చేసింది. ఈ ఇన్’ సిరీస్ లైనప్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి, ఒకటి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మరొకటి మైక్రోమాక్స్ ఇన్ 1బి.
బెంగళూరు: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్ చైనా బ్రాండ్లకు గట్టి పోటీగా కనిపిస్తుంది. ఈ రెండు మోడళ్ల స్మార్ట్ ఫోన్లను 'ఇన్’ సిరీస్‌లో లాంచ్ చేసింది.
ఈ ఇన్’ సిరీస్ లైనప్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి, ఒకటి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మరొకటి మైక్రోమాక్స్ ఇన్ 1బి. ఈ రెండూ భారతదేశంలోనే తయారకానున్నాయి. డిజైన్ పరంగా అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. “ఇల్యూమినేటింగ్ ప్రిజం పాటర్న్ అంటూ వెనుక ‘ఎక్స్’ పాటర్న్ ఆకర్షణీయంగా ఉంది.
మైక్రోమాక్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు గట్టి పోటీనిచ్చేలా ఉంటాయి” అని అన్నారు.
సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో "ఆవో కరే తోడి చీనీ కం ! నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మైక్రోమాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసిన కొత్త #INMobiles స్మార్ట్‌ఫోన్‌ల మెగా ఆవిష్కరణ అంటూ పోస్ట్ చేసింది.
also read వాట్సాప్‌తో మీ ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా.. ? అయితే ఈ ట్రిక్ యూజ్ చేయండి.. ...
చైనాకు వ్యతిరేకం: జూన్ నెలలో గాల్వన్ లోయలో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఈ సంఘటన తరువాత ప్రతీకార చర్యగా భారతదేశం అనేక చైనీస్ యాప్ లను నిషేధించింది. భారత సైన్య బలగాల మనోధైర్యాన్ని పెంచడానికి ప్రధాని మోడీ కూడా లడఖ్ సందర్శించారు.
ఇన్ నోట్ 1ఫీచర్లు: 6.67అంగుళాల పూర్తి హెచ్‌డీ + డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ), మీడియా టెక్‌హీలియో జీ 85 ప్రాసెసర్, 48+5+2+2 ఎంపీరియర ఏఐ క్వాడ్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీకెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వా (టైప్-సి) ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా నవంబరు 24 నుంచి అందుబాటులో ఉంటాయి. గ్రీన్, వైట్ కలర్స్‌లో లభ్యం కానుంది.
ఇన్ నోట్ 1 ధరలు
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 10999
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12499
మైక్రోమాక్స్ 1బి స్పెసిఫికేషన్
సాఫ్ట్‌వేర్, డిస్ ప్లే : ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడుస్తుంది, 6.5-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే ఉంటుంది.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్: ఈ బడ్జెట్ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి35 ప్రాసెసర్‌తో 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వస్తుంది.
కెమెరా వివరాలు: ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించగా, ప్రాధమిక కెమెరా 13 మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్ ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం: 5000 mAh బ్యాటరీతో, 10W స్టాండర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మైక్రోమాక్స్ 1బి ధర: 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999, 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999.