చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి ఎం‌ఐ 30W  వైర్‌లెస్ పవర్ బ్యాంక్ చైనాలో లాంచ్ చేసింది.  షియోమి నుండి వచ్చిన కొత్త పవర్ బ్యాంక్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్‌తో 10,000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది.

బ్లాక్ కలర్‌ ఆప్షన్ లో మాత్రమే లభ్యమవుతుంది. ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి ఐదు కనెక్టర్ / పోగో పిన్‌లు ఉన్నాయి. పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసే స్టాండ్‌లో పవర్ బ్యాంక్ ఉంచిన తర్వాత ఛార్జింగ్ అవుతుంది. గూగుల్ ప్రారంభించిన పిక్సెల్ స్టాండ్‌ ఇది ఒకేలాగా కనిపిస్తుంది.

ఎం‌ఐ  వైర్‌లెస్ పవర్ బ్యాంక్ 30W ధర
ఎం‌ఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ 30W ధర CNY 199 (ఇండియాలో సుమారు రూ.2,100). చైనాలో ఎం‌ఐ .కంలో ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది, ఇతర దేశాలలో లభ్యతపై ఎలాంటి సమాచారం లేదు.

also read ఆండ్రాయిడ్ యూజర్లు అలర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ వెంటనే డిలిట్ చేయండి.. ...

ఎం‌ఐ  వైర్‌లెస్ పవర్ బ్యాంక్ 30W ఫీచర్లు
ఎం‌ఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. పవర్ బ్యాంక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ పైన వైర్‌లెస్ ఛార్జింగ్ ఐకాన్‌ కనిపిస్తుంది.10,000mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ఇందులో ఉంది. ఈ పవర్ బ్యాంక్ చార్జ్ చేయడానికి ఐదు పోగో పిన్‌లు ఉన్న ఛార్జింగ్ స్టాండ్ తో వస్తుంది.

ఇది పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేస్తుంది. పవర్ బ్యాంక్ పైన  ఉన్న ఎల్‌ఈ‌డి బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ యూ‌ఎస్‌బి టైప్-ఎ పోర్టుతో గరిష్టంగా 27W ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరొక పోర్ట్ యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, ఇది గరిష్టంగా 30W అవుట్పుట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ బట్టి పవర్ బ్యాంక్ 30W వరకు దేవైజెస్ వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ పవర్ బ్యాంక్‌ను వైర్ లెస్ ఛార్జింగ్ స్టాండ్ ద్వారా ఛార్జ్ చేయకూడదనుకుంటే, మీరు దీన్ని యూ‌ఎస్‌బి టైప్ సి పోర్ట్‌తో కనెక్ట్ చేయవచ్చు, ఇది గరిష్టంగా 18W పవర్ ఇన్‌పుట్ కలిగి ఉంటుంది. పోగో పిన్స్ ద్వారా పవర్ బ్యాంక్ గరిష్టంగా 10Wతో చార్జ్ చేస్తుంది.