వీడియో కాల్‌తోపాటు మెసేజ్ పంపొచ్చు.. షియోమీ ఎంఐయూఐ అప్‌డేట్ స్పెషల్

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఎంఐ తన అభిమాన వినియోగదారుల కోసం షియోమీ ఫోన్ లో ఎంఐయుఐ 11 అప్ డేట్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల మన పని చేస్తూనే సేవలు పొందొచ్చు. వీడియో కాల్ చూస్తూనే మెసేజ్ పంపొచ్చు. మహిళల నెలసరి క్రమబద్ధీకరించేందుకు కూడా ఈ ఎంఐయూఐ 11 అప్ డేట్ ఉపకరిస్తుంది.

Mi Fans, This is When Your Xiaomi Phone will Receive the MIUI 11 Update

న్యూఢిల్లీ: చైనా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ఫోన్లలో ఉండే ఎంఐయూఐలో భారీ మార్పుతో భారత్​లో అప్​డేట్ వెర్షన్​ను ఇటీవల విడుదల చేసింది. ఎంఐయూఐ కాస్త బ్లోట్‌వేర్‌ ఉన్నా అదనపు ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. స్టాక్‌ ఆండ్రాయిడ్‌లో లేని చాలా ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

యూఐ డిజైన్‌ను లైట్‌ చేస్తూ చాలావరకు రంగుల్ని తొలగించారు. ఫుల్​ స్క్రీన్ అనుభూతిని ఇచ్చేందుకు కాంటాక్ట్స్‌లో ఫొటో స్పేస్‌లో రంగు, రెండు అంశాల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో రంగు తీసేసి యూఐ వైడ్‌ డార్క్‌ మోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లేలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. డైనమిక్‌ క్లాక్‌ ఫీచర్‌ను ఆల్వేస్‌ ఆన్‌కు జోడిస్తున్నారు.

లాక్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ ఆప్షన్‌నూ తీసుకొస్తున్నారు. మీకు నచ్చిన కోట్స్‌, పదాలను స్క్రీన్‌ సేవర్‌గా పెట్టుకునే ఆప్షన్ కూడా పొందు పరుస్తారు. నోటిఫికేషన్‌ లైట్‌లోనూ మార్పులు చేశారు. గతంలో నోటిఫికేషన్‌ వస్తే స్క్రీన్‌ టాప్‌లో గానీ, దిగువ కానీ ఒక చిన్న లైట్‌ కనిపించేది. కానీ ఇప్పుడు ఈ విధానం మారుతోంది. నోటిఫికేషన్‌ వచ్చినప్పపుడు స్క్రీన్‌ అంచుల్లో (ఎడమ, కుడివైపు) ఓ మెరుపులా కనిపించనుంది.

ఇంకా ఇందులో డైనమిక్‌ వాల్‌ పేపర్స్‌ తీసుకొస్తున్నారు. అంటే వాల్‌ పేపర్‌ కదలకుండా స్టాటిక్‌ ఉండదు. జీఐఎఫ్​ తరహాలో వాల్‌పేపర్‌ లో కదలికలు కూడా కనిపిస్తాయి. మీకు నచ్చిన వీడియోలను కూడా వాల్‌ పేపర్లుగా మార్చుకునే వసతి అందుబాటులోకి రానున్నది.

డాక్యుమెంట్లు చూడటం మరింత సులభం..ఫైల్‌ మేనేజర్‌లో థంబ్‌ నెయిల్‌ వ్యూని అందుబాటులోకి తెస్తున్నారు. మొబైల్‌ లోని ప్రతి డాక్యుమెంట్‌ని థంబ్‌ రూపంలో చూసుకోవచ్చు. ప్రస్తుతం డాక్యుమెంట్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే అది వేరే యాప్‌లోకి వెళ్లి అక్కడ ఓపెన్‌ అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఫైల్‌ మేనేజర్‌లోనే డాక్యుమెంట్స్‌ ప్రివ్యూ చూసుకునేలా కొత్త యూఐలో మార్పులు చేశారు.

నోట్స్‌ యాప్‌లో టాస్క్‌ ఫంక్షనాలిటీని తీసుకొస్తున్నారు. టాస్క్‌ ఎంట్రీ చేయడానికి నోట్స్‌ యాప్‌ను పదే పదే ఓపెన్‌ చేయకుండా ఓ షార్ట్‌కట్‌ తీసుకొచ్చారు. హోం పేజీ టాప్‌లో ఎడమవైపు నుంచి కుడివైపునకు స్వైప్‌ చేస్తే టాస్క్​ఎంటర్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది.

నోట్స్‌లో ఏదైనా అంకెలు, లెక్కలు రాసుకొని తర్వాత క్యాలికులేటర్‌తో లెక్కిద్దాం అంటే కష్టం. క్యాలికులేటర్, నోట్స్‌ యాప్‌ను మార్చి మార్చి చూసుకోవాలి. ఈ ఇబ్బంది లేకుండా పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఆప్షన్‌ ద్వారా క్యాలికులేటర్ ఏ డాక్యుమెంట్‌లోనైనా వాడుకునేలా మార్పులు చేశారు.

క్యాలికులేటర్లో కొత్త ఆప్షన్లను కూడా తీసుకొచ్చారు. వయసు, ఈఎంఐ, జీఎస్టీ లాంటి వాటిని లెక్కించడానికీ ఇప్పుడు క్యాలికులేటర్‌ వాడొచ్చు. వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎన్ని అడుగులు వేశారనేది తెలుసుకోవడానికి రకరకాలు యాప్స్‌ వాడుతుంటారు. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా స్టెప్స్‌ ట్రాకర్‌ను యూఐలో ఇంటిగ్రేట్‌ చేస్తున్నారు. దీన్ని యాప్‌ వాల్ట్‌లోకి తీసుకొస్తున్నారు.

ఇక మహిళల కోసం కూడా ఓ ఆప్షన్‌ తీసుకొచ్చారు. మహిళల నెలసరి సైకిల్స్‌ సులభంగా లెక్కించుకునేలా ఓ ఆప్షన్‌ ఇచ్చారు. దీన్ని మీ మొబైల్‌ క్యాలెండర్‌కు సింక్‌ చేస్తున్నారు.

ఇక నుంచి కాల్స్ వచ్చినా వీడియో చూడొచ్చు..వీడియో చూస్తున్నప్పుడు మొబైల్‌కు వచ్చిన కాల్‌ అటెండ్‌ చేస్తే.. వీడియో మినిమైజ్‌ అయిపోయి కాలింగ్‌ స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది. ఇకపై అలా మినిమైజ్‌ అవ్వకుండా వీడియో ప్లే అవుతూనే పైన ఎడమవైపు కాల్ రన్నింగ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. గేమ్స్‌ ఆడుతున్నప్పుగూ ఈ ఆప్షన్‌ను వాడుకోవచ్చు.

మరోవైపు స్మార్ట్‌ రిప్లైస్‌ ఫీచర్‌ను కూడా కొత్త వెర్షన్‌లో తెస్తున్నారు. వీడియో చూస్తున్నప్పుడు, గేమ్‌ ఆడుతున్నప్పుడు ఏదైనా మెసేజ్‌, వాట్సాప్‌ లాంటివి వస్తే.. ఆ నోటిఫికేషన్‌ ను క్లిక్‌ చేయగానే స్క్రీన్‌ మీద పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఆప్షన్‌ ద్వారా అక్కడే ఆ మెసేజ్‌ ఓపెన్‌ అవుతుంది. మీరు అక్కడి నుంచే స్మార్ట్‌గా రిప్లై ఇవ్వొచ్చు.

నేచురల్‌ సౌండ్‌, వైర్‌లెస్‌ ప్రింట్‌, డ్యూయల్‌ క్లాక్‌, నేచర్‌ అలారమ్‌, న్యూ గేమ్‌ టర్బో, ఎంఐ షేర్‌, గ్యాలరీ మంథ్‌ వ్యూ, పంచాంగం, కాస్టింగ్‌ లాంటి ఫీచర్లు కూడా ఎంఐయూఐ11 లో ఉంటాయి. వీటి వివరాలను షియోమీ త్వరలో సోషల్‌ మీడియాలో వివరించనున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios