చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ ఎం‌ఐ10ఐ  తాజాగా లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే లాంచ్ సందర్భంగా షియోమి ఎం‌ఐ10ఐ ఫస్ట్ సెల్ భారతదేశంలో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది.

 మొదటి సెల్ లో షియోమి 200 కోట్ల విలువైన ఎం‌ఐ10ఐ స్మార్ట్ ఫోన్స్ విక్రయించింది. జనవరి 7న ప్రారంభమైన మొదటి సెల్ అమెజాన్ ఇండియా, షియోమి ఎం‌ఐ అధికారిక సైట్ ద్వారా ఫోన్ లను విక్రయించింది. 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి రెండు వేరియంట్లు అమెజాన్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి.

షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ మాట్లాడుతూ, ఈ ఫోన్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది, ఎం‌ఐ10ఐ కోసం మా ఎం‌ఐ అభిమానులు, వినియోగదారుల నుండి వచ్చిన  ప్రతిస్పందనకు మేము నిజంగా గర్విస్తున్నాము. మొదటి సెల్ లో రూ.200 కోట్ల సేల్స్ గొప్ప మైలురాయి, మేము దానిని ప్రకటించడం సంతోషంగా ఉంది అని అన్నారు.

ఎం‌ఐ 10ఐ 6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌  ధర 20,999, అలాగే 6 జిబి ర్యామ్‌తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, 8 జిబి ర్యామ్‌+ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. పసిఫిక్ సన్‌రైజ్, మిడ్నైట్ బ్లాక్ అట్లాంటిక్ బ్లూ కలర్‌లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

also read టెలీగ్రాంకు కలిసొచ్చిన వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానం.. 72 గంటల్లో కోట్లకు పెరిగిన డౌన్ లోడ్లు.. ...

ఎం‌ఐ 10ఐ  స్పెసిఫికేషన్లు

ఫీచర్స్ గురించి చెప్పాలంటే  ఎం‌ఐ 10ఐ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12ను అందించింది. ఇది కాకుండా 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్, 450 నిట్స్ బ్రైట్,  హెచ్‌డి‌ఆర్ అండ్ హెచ్‌డి‌ఆర్ 10+ సపోర్ట్, ముందు ఇంకా వెనుక ప్యానెల్ పై గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్, 5జి సపోర్ట్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 619 జిపియు, 8 జిబి ర్యామ్ + 128 జిబి వరకు స్టోరేజ్ పొందవచ్చు.

ఎం‌ఐ 10ఐ కెమెరా

ఈ ఫోన్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, ప్రధాన లెన్స్ కెమెరా 108 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

ఎం‌ఐ 10ఐ బ్యాటరీ 

ఎం‌ఐ 10ఐలో 4820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. దీని ఛార్జర్ కేవలం 30 నిమిషాల్లో ఫోన్ బ్యాటరీని 68 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీలో 5జి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. స్ప్లాష్ ప్రూఫ్ కోసం ఐ‌పి53 రేట్ చేయబడింది. ఫోన్ బరువు 214.5 గ్రాములు.