వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. ప్రపంచవ్యాప్తంగా సిగ్నల్ యాప్ డౌన్.. నిజమేనంటూ ట్వీట్..

ఇన్స్టంట్  మెసేజింగ్ యాప్ సిగ్నల్‌ కి మారడం ప్రారంభించారు. దీంతో సిగ్నల్‌ యాప్ డౌన్ లోడ్లు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిగ్నల్‌  యాప్ వినియోగదారులకు శుక్రవారం నుండి సిగ్నల్ యాప్ ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కోన్నారు. 

messaging app signal faces global outage days after adding millions of users from whatsapp

 వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ విధానం వచ్చినప్పటి నుండి మిలియన్ల మంది వినియోగదారులు ఇన్స్టంట్  మెసేజింగ్ యాప్ సిగ్నల్‌ కి మారడం ప్రారంభించారు. దీంతో సిగ్నల్‌ యాప్ డౌన్ లోడ్లు కూడా భారీగా పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిగ్నల్‌  యాప్ వినియోగదారులకు శుక్రవారం నుండి సిగ్నల్ యాప్ ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కోన్నారు. సిగ్నల్ యాప్ డౌన్ అయిందని కొందరు యూజర్లు ట్వీట్ చేయగా మెసేజింగ్ యాప్ సిగ్నల్ కూడా దీన్ని ధృవీకరించింది.

సిగ్నల్‌ యాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి సిగ్నల్ యాప్ టీమ్ కృషి చేస్తున్నారని ట్వీట్‌ ద్వారా తెలిపింది. సిగ్నల్ యాప్ చేసిన ట్వీట్‌లో "సిగ్నల్ యాప్ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది, సేవలను త్వరగా పునరుద్ధరించడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము" పోస్ట్ చేసింది.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానానికి సంబంధించి తొలిసారిగా వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపింది, అయితే కొత్త విధానం వారికి పెద్ద సమస్యగా మారింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంతో కలత చెందిన యూజర్లు మరొక మెసేజింగ్ యాప్ వైపు వెళ్తున్నారు.

also read జియో కస్టమర్లకు షాక్.. ఆ 4 ప్రీపెయిడ్ ప్లాన్ల తొలగింపు.. ...

కొత్త పాలసీ విడుదలైన ఏడు రోజుల్లోనే భారతదేశంలో వాట్సాప్ డౌన్‌లోడ్‌లు 35% తగ్గాయి. ఇవే కాకుండా 40 లక్షలకు పైగా వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు, వీటిలో సిగ్నల్ 24 లక్షల డౌన్‌లోడ్‌లు, టెలిగ్రామ్ 16 లక్షల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి.

వాట్సాప్ సంస్థ కొత్త  ప్రైవసీ పాలసీపై మరింత స్పష్టత ఇచ్చిన తరువాత కూడా వినియోగదారులు ఇతర యాప్స్ వైపు వేగంగా మారుతున్నారు. భారతదేశంలోని చాలా మంది అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు కూడా వాట్సాప్ ను వదిలి సిగ్నల్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు.

టెస్లా  సి‌ఈ‌ఓ, ప్రపంచంలోని రెండవ ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కూడా సిగ్నల్‌ యాప్  ఉపయోగించండీ అని విజ్ఞప్తి చేశారు. సిగ్నల్ యాప్ పర్సనల్ డేటా అడగదు, ఇంకా సిగ్నల్ యాప్ తాజా వెర్షన్లతో గ్రూప్ కాల్స్ ను డిసెంబర్ 2020లో ప్రారంభించింది.

సిగ్నల్ యాప్ మీ ఫోన్ నంబర్‌ను వ్యక్తిగత డేటాగా మాత్రమే స్టోర్ చేస్తుంది. కాగా, టెలిగ్రామ్ కాంటాక్ట్స్ సమాచారం, పరిచయాలు, వినియోగదారుడి ఐడిని వ్యక్తిగత సమాచారంగా అడుగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios