న్యూ ఢీల్లీ: అమెరికన్ టీన్ చార్లీ గ్రేస్ డి అమేలియో ఆన్‌లైన్‌లో సెన్సేషన్ గా మారింది. ఎందుకొ తెలుసా ? 16 ఏళ్ల ఈ డాన్సర్ వీడియో షేరింగ్ అప్లికేషన్ టిక్‌టాక్‌లో 10 కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

చార్లీని ఇప్పటికీ టిక్‌టాక్ 'అతిపెద్ద స్టార్' గా పరిగణిస్తారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ అక్కౌంట్ కూడా ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 33.8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఫార్చ్యూన్ 40 అండర్ 40 లిస్ట్ 2020లో ఆమె ఈ సంవత్సరం తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించి, ఫోర్బ్స్లో అత్యధికంగా డబ్బు సంపాదించిన రెండవ టిక్‌టాక్‌ పర్సనాలిటీగా కూడా పేర్కొనబడింది.

also read మీ స్మార్ట్ ఫోన్‌లో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు.. ఎలా అనుకుంటున్నార ? ...

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చార్లీ యానిమేటెడ్ చిత్రం స్టార్‌డాగ్ (2020), టర్బోకాట్ చిత్రాలలో వాయిస్ రోల్‌తో సినీరంగ ప్రవేశం చేసింది. ఆమెకు నెయిల్ పాలిష్ కలెక్షన్, మేకప్ లైన్, స్వేట్  షర్ట్  కలేక్షన్స్ కూడా ఉన్నాయి.

చార్లీ తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయటం వల్ల పాపులర్ అయ్యింది. ఆమె మొదట 30 మార్చి 2019న  టిక్‌టాక్‌ ప్లాట్‌ఫాంపై తన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది. 

అయితే ఇంత తక్కువ వ్యవధిలో 10కోట్ల మంది ఫాలోవర్స్ సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మొదటి పుస్తకం ఎసెన్షియల్లీ చార్లీ: ది అల్టిమేట్ గైడ్ టు కీపింగ్ ఇట్ రియల్ ను డిసెంబర్ 2020లో విడుదల చేయనుంది.

https://www.instagram.com/charlidamelio/?utm_source=ig_embed