అలీబాబా గ్రూప్ ఫూండెడ్ తో కూడిన పేటీఎం మాల్ భారీ డేటా ఉల్లంఘనకు గురైందని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబుల్ నివేదించింది.  ‘జాన్ విక్’ అనే సైబర్ క్రైమ్ గ్రూప్ చెందిన హాకర్లు పేటీఎం మాల్‌ డేటాబేస్‌పై దాడి   చేసినట్లు సమాచారం.

ఈ హ్యాక్ పేటీఎం మాల్ వద్ద ఒక ఇంటర్నల్ వ్యక్తి కారణంగా జరిగింది అని నివేదిక ఆరోపించింది. అయితే అటువంటి హాక్ లేదా డేటా ఉల్లంఘనపై కంపెనీ తీవ్రంగా ఖండించింది. వినియోగదారులతో పాటు కంపెనీ డేటా కూడా పూర్తిగా సురక్షితంగా ఉందని మేము హామీ ఇస్తూన్నాము.

also read మీ జీ-మెయిల్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఈ ట్రిక్స్ ఉపయోగించండి ! ...

హాక్ లేదా డేటా ఉల్లంఘన వాదనలను మేము ఖండిస్తున్నాము, అవన్నీ అవాస్తవం అని పేటీఎం మాల్‌ ప్రతినిధి తెలిపారు. డేటా సెక్యూరిటీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. మాకు బగ్‌ బౌంటీ ప్రొగ్రామ్‌ కూడా ఉంది.  

డేటా చౌర్యానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ తమ దగ్గర ఉన్నదని'  వివరించారు. మేము భద్రతా పరిశోధన టీమ్ తో డేటా చౌర్యం జరిగిందన్న వార్తలపై సమగ్ర దర్యాప్తు చేశామని, ఆ వార్తలు నిరాధారమని తమ పరిశీలనలో వెల్లడైంది అని పేటీఎం మాల్ ప్రతినిధి అన్నారు.

హ్యాక్ చేసిన డేటా పరిమాణం తెలియకపోయినా దాడి చేసేవారు డేటాను తిరిగి ఇచ్చేందుకు క్రిప్టోకరెన్సీలో భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని గ్లోబల్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌  సైబుల్ పేర్కొన్నారు.