పాపులర్ లగ్జరీ గాడ్జెట్లలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన రష్యన్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కేవియర్ కస్టమ్-మేడ్, ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ ను స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసి లాంచ్ చేసింది.   ఈ గోల్డ్ హెడ్‌ఫోన్స్ ధర 108,000 డాలర్లు, అంటే ఇండియాలో దీని ధర సుమారు రూ.80 లక్షలు.

ఈ లగ్జరీ హెడ్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా ఒక్కటి మాత్రమే  విడుదల చేసింది అని కేవియర్ సంస్థ తెలిపింది. ఈ హెడ్‌ఫోన్‌ల ఇయర్‌కప్‌లను స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసింది, అయితే ఎయిర్‌పోడ్స్‌ మాక్స్‌ ఇయర్‌ కప్స్‌ను యాపిల్‌ కంపెనీ అల్యూమినియంతో తయారు చేస్తోంది.

కేవియర్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ హెడ్‌ఫోన్‌లు తెలుపు లేదా నలుపు హెడ్‌బ్యాండ్‌లో వస్తాయి కాని ఇయర్‌కప్స్ రెండు వెర్షన్‌లకు బంగారంతో ఉంటాయి. అంతేకాకుండా మెష్‌ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్‌ లెదర్‌తో అలంకరించింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్‌ పేర్కొంది.

also read జనవరి 1 తరువాత టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.. ...

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ ఈ నెల ప్రారంభంలో హై-ఫిడిలిటీ సౌండ్, అడాప్టివ్ ఇక్యూ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పెషియల్ ఆడియోతో రూ.59,900 ధరతో  లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయో లేదో సమాచారం లేనప్పటికి కొత్త ఏడాది 2021లో ఈ హెడ్‌ఫోన్స్‌ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. 

 ఎయిర్‌పాడ్స్ మాక్స్‌ వినియోగదారులకు స్పష్టమైన శబ్దం, అడాప్టివ్‌ ఈక్వలైజర్‌, అనవసర శబ్దాలను తగ్గించే సాంకేతికలతో రూపొందించింది. చుట్టూ ఉన్న ప్రదేశంలో శబ్దాలను వినేటప్పుడు ఏకకాలంలో మ్యూజిక్ వినడానికి ట్రాన్స్పరెంట్ మోడ్‌కు మారవచ్చు.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెంట్ మోడ్ మధ్య మారడానికి సౌండ్ కంట్రోల్ బటన్‌ను ఉపయోగించి ఒకే ప్రెస్‌తో మారవచ్చు.

ఎయిర్‌పాడ్స్ మాక్స్ బ్యాటరీ లైఫ్ హై-ఫిడిలిటీ ఆడియో, టాక్ టైమ్ లేదా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పెషియల్ ఆడియో ఎనేబుల్ చేసి మూవీ ప్లేబ్యాక్‌తో 20 గంటల వరకు అందిస్తుంది.