స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవా త్వరలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి  ప్రవేశపెట్టనుంది. రెడ్‌మి నోట్ 9 సిరీస్‌కి పోటీగా లెనోవా కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

లెనోవా నుండి రాబోయే కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో టీజర్‌ను విడుదల చేసింది. ఈ వారం చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 9 కొత్త మోడల్‌తో పోటీగా లెనోవా కొత్త సిరీస్ ఉంటుందని చెబుతున్నారు.

టీజర్ ప్రకారం, లెనోవా మూడు కొత్త బడ్జెట్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేయనుంది, అయితే ఈ ఫోన్ ఫీచర్స్ గురించి లెనోవా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

also read పబ్-జి మొబైల్ గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇండియన్ యూసర్ల కోసం లింక్ ద్వారా గేమ్ డౌన్ లోడ్.. ...

ఈ కొత్త సిరీస్ లెనోవా మోటో జి9 పవర్ రీ-బ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేయవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.  

ఆన్‌లైన్ లిస్టింగ్ ప్రకారం  ఈ సిరీస్‌లోని ఒక ఫోన్‌ మోటో జి9 పవర్ వేరియంట్ ఇటీవల చైనా వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ ఎక్స్‌టి 2091-7తో గుర్తించింది. 6.78-అంగుళాల డిస్ ప్లేతో,  5,640 ఎంఏహెచ్ బ్యాటరీతో రావచ్చని  ఊహించవచ్చు.

అయితే మోటో జి9 పవర్ 6.8-అంగుళాల డిస్‌ప్లేతో, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది రెండు ఫోన్‌ల మధ్య కొన్ని ఫీచర్స్ తేడాలను కూడా సూచిస్తుంది.