JioPhone Next: జియో ఫోన్‌ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఆఫ్‌లైన్‌లో..!

వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌గా జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next)ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో (Reliance Jio).

JioPhone Next now available in offline stores

వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌గా జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next)ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో (Reliance Jio). తక్కువ ధరలోనే మంచి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్‌ను గత సంవత్సరం నవంబర్ 4న దీపావళి సందర్భంగా లాంచ్ చేసింది. టెక్ దిగ్గజం గూగుల్ (Google) భాగస్వామ్యంతో ముకేశ్ అంబానీకి చెందిన జియో.. JioPhone Nextను తీసుకొచ్చింది. అయితే ఇంత కాలం ఈ మొబైల్‌ను కొనాలంటే ఆన్‌లైన్‌ ద్వారానే సాధ్యమయ్యేది. లేకపోతే ముందుగా జియో వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ చేసుకొని.. ఆ తర్వాత జియో స్టోర్‌కు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదీ లేకుండా JioPhone Nextను కొనుగోలు చేయవచ్చు. 

జియో సంస్థ గతేడాది నవంబర్‌ 4న మార్కెట్‌లోకి జియో ఫోన్‌ నెక్ట్స్ ను విడుదల చేసింది. తొలుత ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం కొనుగోలుదారులు ముందస్తుగానే రిజస్ట్రర్‌ చేసుకుంటేనే ఈ బడ్జెట్‌ ఫోన్‌ ను సొంతం చేసుకునే అవకాశం క‌ల్పించింది జియో. అయితే ఇప్పుడు ఇదే ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయోచ్చని జియో ప్రతినిధులు తెలిపారు.

జియోఫోన్ నెక్ట్స్  ధరను (JioPhone Next price) రూ.6,499గా నిర్ణయించింది కంపెనీ. అయితే అందరికీ స్మార్ట్​ఫోన్, 4జీ సేవలు అందించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చిన కారణంగా.. (JioPhone next EMI) రూ.1,999 చెల్లించి ఫోన్​ను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా మొత్తాన్ని సులభతర ఈఎంఐలలో చెల్లించొచ్చని వెల్లడించింది. రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

 

ఫోన్‌ ఫీచర్లు ఇవే..!

- 5.45 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే (గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్), (720 X 1440 )

- స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్‌ ప్రింట్ కోటింగ్

- క్వాల్కమ్​ శ్నాప్​డ్రాగన్​ 215, క్వాడ్​కోర్​ ప్రాసెసర్

- 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్ (ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 512 జీబీ వరకు)

- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, బ్యాక్‌ కెమెరా: 13 ఎంపీ

- 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

- డ్యుయల్ నానో సిమ్

- వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5 ఎంఎం
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios