క్రికెట్ ఫ్యాన్స్ కి గొప్ప శుభవార్త, రాబోయే ఐ‌పి‌ఎల్ క్రికెట్ సీజన్ కోసం జియో మల్టీ టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. జియో క్రికెట్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ డాటా ప్లాన్స్ రూ.399 ప్లాన్ తో డేటా, వాయిస్ కాల్స్ తో పాటు 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ వి‌ఐ‌పి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా క్రికెట్ అభిమానులు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ద్వారా ఉచిత డ్రీమ్ 11 లైవఐపిఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు. 1 నెల, 2 నెలలు, 3 నెలలతో పాటు 1 సంవత్సరపు వాలిడిటీ అయ్యే ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది.

ప్రత్యేక యాడ్ ఆన్ డేటా కూడా అందుబాటులో ఉంది. ఈ టారిఫ్ ప్లాన్లను లైవ్ ఐపిఎల్ మ్యాచ్‌లను చూడటానికి ఉచిత డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌తో ప్రారంభించింది.


 జియో ధనా ధన్ ప్లాన్ వివరాలు

also read అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా ...

రూ .401 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌తో 28 రోజుల వాలిడిటీ ఉంటుంది.

రూ 598 ప్లాన్: ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్,  1 సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 2 జిబి డేటా అందిస్తుంది. ఈ  ప్లాన్‌ 56 రోజుల వాలిడిటీ వస్తుంది.

రూ 777 ప్లాన్: రోజుకు 1.5 జిబి డేటా /  ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది. ఇది 84 రోజుల వాలిడిటీ ఇస్తుంది.

రూ .2599 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 2 జిబి డేటా/ ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌తో  365 రోజుల వాలిడిటీ  అందిస్తుంది.

రూ .499 డేటా యాడ్-ఆన్ ప్లాన్: రూ.399 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటా + 1 సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. రూ.499 డేటా యాడ్-ఆన్ 56 రోజుల వాలిడిటీ ఇస్తుంది.