టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది.  కొత్త ప్లాన్‌లు నెలకు రూ. 499 ప్రారంభంతో లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ల పై  ఆన్ లిమిటెడ్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ప్రవేశపెట్టింది.

అంతేకాదు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను కూడా ప్రకటించింది, దీని కింద ఎక్స్‌ట్రీమ్ ఆండ్రాయిడ్ 4కె టివి బాక్స్‌తో  అన్ని ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లపై ఒటిటి యాప్స్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందిస్తోంది.

ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ కోసం ప్లాన్లను పునరుద్ధరించిన వారంలోనే ఈ కొత్త మార్పులు చేసింది. తాజా అప్ డేట్ ప్రకారం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఐదు వేర్వేరు నెలవారీ ప్లాన్స్ ప్రారంభించింది.

also read i7 ప్రాసెసర్‌, లాంగ్ బ్యాటరీ లైఫ్ తో ఏసర్‌ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ...

ఇందులో రూ. 499 ప్రారంభ ప్లాన్ ద్వారా  40ఎం‌బి‌పి‌ఎస్ స్పీడ్ ఇస్తుంది. రూ.799  ప్లాన్ 100ఎం‌బి‌పి‌ఎస్, రూ.999 ప్లాన్ 200ఎం‌బి‌పి‌ఎస్, రూ.1,499 ప్లాన్ 300ఎం‌బి‌పి‌ఎస్, 3,999 ప్లాన్  1జిబి‌పి‌ఎస్ స్పీడ్ అందిస్తుంది.

అన్ని కొత్త ప్లాన్స్ ఆన్ లిమిటెడ్ హై-స్పీడ్ డేటా అందిస్తున్నట్లు పేర్కొంది. కొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కనెక్షన్‌తో ల్యాండ్‌లైన్ ఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి.

ఈ ప్లాన్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ యాక్సెస్ కూడా ఇస్తుంది, ఇందులో 10వేలకు పైగా సినిమాలు, షోలు, ఒటిటి యాప్స్, ఒరిజినల్ సిరీస్‌లు ఉన్నాయి. కొత్త ప్లాన్‌లతో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ఆఫర్‌ కింద అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, జీ5 లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ ఇస్తుంది.

అయితే రిలయన్స్ జియోకు పోటీగా ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ వీటిని ప్రవేశపెట్టింది, ఇటీవల జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన టెలికాం ఆపరేటర్ కొత్త కస్టమర్లందరికీ "నో-కండిషన్ 30-రోజుల ఉచిత ట్రయల్" ను ప్రవేశపెట్టింది.