5 వేలకే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ?

లయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌లను 5,000 రూపాయల లోపు ధరకే విక్రయించాలని యోచిస్తోంది. 5జి స్మార్ట్‌ఫోన్‌ను 5వేల రూపాయల కన్నా తక్కువ ధరకు అందించాలని, అలాగే అమ్మకాలు పెరిగితే దాని ధర రూ .2,500-3,000 వేలకు తగ్గుతుందని రిలయన్స్ జియో అధికారి తెలిపారు.


 
 

jio 5g smartphone price under rs 5000 to increase sale company wants to sale it on rs 2500-sak

 భారతదేశంలో ప్రస్తుతం 4జి ఫోన్ ధర 5,000 రూపాయల కన్నా తక్కువకు అందుబాటులో లేదు, అయితే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌లను 5,000 రూపాయల లోపు ధరకే విక్రయించాలని యోచిస్తోంది. 5జి స్మార్ట్‌ఫోన్‌ను 5వేల రూపాయల కన్నా తక్కువ ధరకు అందించాలని, అలాగే అమ్మకాలు పెరిగితే దాని ధర రూ .2,500-3,000 వేలకు తగ్గుతుందని రిలయన్స్ జియో అధికారి తెలిపారు.

ఈ చొరవలో ప్రస్తుతం 2జి కనెక్షన్లను ఉపయోగిస్తున్న మొబైల్ వినియోగదారులను 5జి‌లోకి అప్ డేట్ ఆయ్యేలా కంపెనీ ప్రయత్నిస్తుంది. ఒక సంస్థ అధికారి మాట్లాడుతూ, "జియో పరికరాల ధరను 5,000 రూపాయల కన్నా తక్కువలో అందించాలని కోరుకుంటుంది. సేల్స్ పెరిగినప్పుడు దీని ధర రూ.2,500-3,000 చేరవచ్చు.

also read 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5జి ఆప్షన్ తో రెడ్ మీ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. ...  

ప్రస్తుతం, భారతదేశంలో లభించే 5జి స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.27 వేల నుంచి ప్రారంభమవుతుంది. భారతదేశంలో వినియోగదారులకు తక్కువ ధరకే 4జి మొబైల్ ఫోన్‌లను అందించిన మొట్టమొదటి సంస్థ రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఫోన్‌ ను 1,500 రూపాయలకు  మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఇండియాని 2జి ఫ్రీ (2జి కనెక్షన్లు లేకుండా) చేయడానికి సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్ అవసరాన్ని నొక్కి చెప్పారు. 

రిలయన్స్ 5జి నెట్‌వర్క్ పరికరాలపై కూడా పనిచేస్తోంది, ఈ ఉత్పత్తులను పరీక్షించడానికి స్పెక్ట్రం కేటాయించాలని డిఓటిని కోరింది. రిలయన్స్ జియో అభ్యర్థనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారతదేశంలో ప్రస్తుతం 5జి సేవలు లేవు, 5జి టెక్నాలజీని పరీక్షించడానికి టెలికాం ఆపరేటర్లకు ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయించలేదు.

అయితే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి ఎప్పుడు అదుబాటులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios