గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి కారణంగా ఐటీ, అనుబంధ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం కల్పించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ (హైసియా) తాజా సర్వే ప్రకారం రోజురోజుకి కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుంటం వల్లే ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేందుకే ఆసక్తి చూపుతున్నాట్లు తెలిపింది.

95 శాతం ఐటీ కంపెనీలు వారి ఉద్యోగుల్లో 90 నుంచి 100 శాతం మందితో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయించుకుంటున్నాయని, గత రెండు నెలల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారి సంఖ్య మరింత పెరిగిందని హైసియా  వెల్లడించింది.

also read  ప్రపంచంలోనే మొదటిసారిగా బయోనిక్ కన్నుతో అంధులకు తిరిగి కంటిచూపు పొందే అవకాశం : పరిశోధకులు ...

80% కంపెనీలు ఉద్యోగుల ఉత్పాదకత 75% ఉన్నట్టు, పెద్ద కంపెనీల్లో మాత్రం 90 శాతంగా ఉన్నట్టు తెలిపాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఇబ్బందులు, విద్యుత్‌ కోతలు, ఇంట్లో పని వాతావరణం ఒకోసారి అనుకూలంగా లేకపోవడం లాంటి సమస్యలు  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు  ఇబ్బందికరంగా ఉన్నాయని 34 శాతం మంది వెల్లడించారు.

గత 6 నెలల్లో దాదాపు తక్కువ నుంచి ఎక్కువగా వెయ్యి మంది వరకు ఫ్రెషర్లను ఉద్యోగాల్లో చేర్చుకున్నట్టు పలు కంపెనీలు పేర్కొనయి.