ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. 

instagram new feature reels rolling uut in india

ఇండియలో టిక్ టాక్ తో సహ 58  చైనా యాప్స్ బ్యాన్ తరువాత ఇండియన్ యాప్స్ కి డౌన్ లోడ్స్ పెరిగాయి. తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది.

ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు యాప్ లో వీడియోలను సృష్టించడానికి, ఫిల్టర్‌లను, మ్యూజిక్  జోడించడానికి, వారి ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. కొత్త ఫీచర్ వినియోగదారులకు  యాప్ లో వీడియోలను క్రియేట్ చేయడానికి, క్రియేటివ్ ఫిల్టర్లను, వీడియోలకి  మ్యూజిక్ జోడించడానికి, వాటిని షేర్ చేయడానికి అనుమతిస్తుంది అని ఫేస్ బుక్ ప్రొడక్ట్ విపి విశాల్ షా అన్నారు.

రీల్స్ ఫీచర్ టిక్‌టాక్ లాగానే ఉంటాయి, జనాదరణ పొందిన సాంగ్స్ , డైలాగ్స్ తో  15 సెకన్ల వీడియోను క్రియేట్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 శాతం వీడియోలు 15 సెకన్లు లేదా అంతకంటే తక్కువ ఉండటం వల్ల ఈ ఉత్పత్తి వచ్చిందని షా చెప్పారు.

కొత్త  ఫీచర్ యూసర్లకు వీడియో షూట్ చేయడానికి, ఇన్‌స్టాగ్రామ్ కేటలాగ్ నుండి ఫిల్టర్‌లను, మ్యూజిక్ జోడించడానికి, ఇతర  సోషల్ మీడియా యాప్స్ లో షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఫార్మాట్‌ను పరీక్షిస్తున్న బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌ల తర్వాత భారతదేశం నాల్గవ దేశం.

ఈ ఫీచర్ భారతదేశంలోని వినియోగదారుల కోసం ఈ రోజు రాత్రి 7:30 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తికరమైన రీల్స్ సృష్టించడానికి, అందరితో షేర్ చేసుకోవడానికి, మ్యూజిక్ కలెక్షన్స్ అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్‌లతో భాగస్వామ్యం చేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: ఎలా ప్రారంభించాలీ
బూమరాంగ్ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్ కెమెరాకు రీల్స్ ఆప్షన్ జోడించింది. వినియోగదారులు రీల్స్ ప్రారంభించడానికి మొదట ఇన్‌స్టాగ్రామ్ కెమెరాను ఓపెన్ చేసి 15 సెకన్ల వీడియోను క్రియేట్ చేయ్దనికి రీల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టిక్‌టాక్ లాగానే, రీల్స్ ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ, స్పీడ్, ఎఫెక్ట్స్, టైమర్ నుండి ఆడియో ఆప్షన్స్ ఉన్నాయి.

also read రిలయన్స్ జియో కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. ఉచితంగా ప్రీమియం కంటెంట్.. ...

రీల్‌ను రికార్డ్ చేసిన తర్వాత, వినియోగదారులు తమ రీల్‌ను షేర్ చేయాలనుకునే నచ్చిన వారిని  సెలెక్ట్ చేసుకోవచ్చు. సాధారణాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగా కాకుండా, రీల్స్‌ను ప్రతి ఒక్కరూ చూడవచ్చు. 15 సెకన్ల రీల్స్ కు ప్రతి క్లిప్‌కు వేర్వేరు ఎఫెక్ట్స్ జోడించవచ్చు. అవసరమైతే రీల్స్‌ను తొలగించి మళ్ళీ రికార్డ్ చేయవచ్చు. టిక్‌టాక్ లాగానే రీల్స్ ‘యూజ్ ఆడియో’ ఆప్షన్ తో  వస్తుంది, ఇది ఇతరులు మీ రీల్‌లను క్రియేట్ చేయడానికి మీ ఒరిజినల్ ఆడియోను ఉపయోగించుకునేలా చేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్  రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి
* ఇన్‌స్టాగ్రామ్ కెమెరా కింద  ఉన్న రీల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండీ 

* ఆడియోపై క్లిక్ చేసి, మీ రీల్ కోసం ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుండి ఒక పాటను సెలెక్ట్ చేసుకోవాలి.

* మీరు టిక్‌టాక్ లాగే రీల్‌ను రికార్డ్ చేయడంలో మీ స్వంత ఒరిజినల్ ఆడియోను కూడా ఉపయోగించవచ్చు.

* మీరు మీ రీల్‌ను ఇంట్రెస్టింగ్ గా, ఇతరుల కంటే కొత్తగా చేయడానికి ఏ‌ఆర్ ఎఫెక్ట్స్ జోడించవచ్చు.  మీ వీడియొ క్లిప్‌లలో దేనినైనా హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి టైమర్‌ను కూడా సెట్ చేయవచ్చు.

* వీడియో లేదా ఆడియోలో కొంత భాగాన్ని స్పీడ్ చేయడానికి లేదా స్లో చేయడానికి ఆప్షన్ కూడా ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios