తక్కువ ధరకే బెజెల్-లెస్ స్క్రీన్లతో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ టీవీలు.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే..

ఇన్ఫినిక్స్ తాజాగా ఎక్స్ 1 సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ 32 ఎక్స్ 1, ఇన్ఫినిక్స్ 43 ఎక్స్ 1 స్మార్ట్ టీవీలను భారతదేశంలో విడుదల చేసింది. రెండు టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్‌ ఓఎస్, బెజెల్-లెస్ స్క్రీన్‌లతో వస్తున్నాయి.

Infinix launches 32X1, Infinix 43X1 Smart TVs With Bezel-Less Screens and HDR10 Support in India

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తాజాగా ఎక్స్ 1 సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ 32 ఎక్స్ 1, ఇన్ఫినిక్స్ 43 ఎక్స్ 1 స్మార్ట్ టీవీలను భారతదేశంలో విడుదల చేసింది. రెండు టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్‌ ఓఎస్, బెజెల్-లెస్ స్క్రీన్‌లతో వస్తున్నాయి.

రెండు టీవీ మోడళ్లు టియువి రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్, బ్లూ లైట్ వేవ్ లెంత్స్ నియంత్రించడం ద్వారా సురక్షితమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంది. ఇన్ఫినిక్స్ 32 ఎక్స్ 1, 43 ఎక్స్ 1 ఫీచర్ ఇపిఐసి 2.0 ఇమేజ్ ఇంజన్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్ ఉన్నాయి. 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్ స్టోరేజ్ పొందుతాయి.

భారతదేశంలో ఇన్ఫినిక్స్ 32ఎక్స్1, ఇన్ఫినిక్స్ 43 ఎక్స్1ధర, లభ్యత
ఇన్ఫినిక్స్ 32ఎక్స్1 ధర రూ. 11,999 ఉండగా, ఇన్ఫినిక్స్ 43ఎక్స్1 ధర రూ. 19,999. రెండు మోడళ్లు డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) ఫ్లిప్‌కార్ట్  ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వీటిని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కమింగ్ సూన్ జాబితాలో చేర్చారు.

also read చైనా ఉత్పత్తులు వాడకుండా భారతదేశపు మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్.. డిసెంబర్ 22న లాంచ్.. ...

ఇన్ఫినిక్స్ 32ఎక్స్1, ఇన్ఫినిక్స్ 43ఎక్స్1 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
ఇన్ఫినిక్స్ 32ఎక్స్1 32-అంగుళాల డిస్ ప్లేతో, ఇన్ఫినిక్స్ 43ఎక్స్1 43 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 32 ఎక్స్ 1 మోడల్‌లో హెచ్‌డి డిస్‌ప్లే అందించగ, 43 ఎక్స్ 1 వేరియంట్ లో ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే అందించారు.

రెండు మోడళ్లలో బెజెల్-లెస్ స్క్రీన్, ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజన్‌తో  వస్తున్నాయి. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్, హెచ్‌డిఆర్ 10కి సపోర్ట్ తో 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. ఇన్ఫినిక్స్ 32ఎక్స్1లో డాల్బీ ఆడియోతో 20W బాక్స్ స్పీకర్లను, ఇన్ఫినిక్స్ 43ఎక్స్1 24W బాక్స్ స్పీకర్లతో వస్తుంది.

రెండు మోడళ్లకు 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తో మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తాయి. కనెక్టివిటీ కోసం రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, ఒక యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ 5.0, వై-ఫై, ఇన్ఫినిక్స్ 32ఎక్స్1తో ఐఆర్ రిమోట్ లభిస్తాయి.

ఇన్ఫినిక్స్ 43 ఎక్స్ 1 లో మీకు మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ 5.0, వై-ఫై, బ్లూటూత్ రిమోట్ వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ కి అక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్నల్ క్రోమ్ క్యాస్ట్ కూడా పొందుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios