Asianet News TeluguAsianet News Telugu

Infinix InBook X1 Slim: అతి తక్కువ ధరకే ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్‌లు..!

ఇన్ఫినిక్స్ కంపెనీ అందుబాటు ధరల్లోనే ఆకర్షణీయమైన Infinix InBook X1 Slim ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 

Infinix InBook X1 Slim launched in India
Author
Hyderabad, First Published Jun 16, 2022, 12:21 PM IST

ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తమ రెండవ తరం ల్యాప్‌టాప్- 'Infinix InBook X1 Slim'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ కంపెనీ గతేడాదే Infinix InBook X1-సిరీస్ ల్యాప్‌టాప్‌లను ఇండియాకు పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ INBook Slimతో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. Slim సిరీస్ అనేది 14-అంగుళాల పూర్తి HD స్క్రీన్ అలాగే Intel ప్రాసెసర్‌లతో కూడిన సూపర్-స్లిమ్ ల్యాప్‌టాప్‌ల సమూహం. ఈ సిరీస్‌లోని తాజా మోడల్ జూన్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Infinix InBook X1 Slim ల్యాప్‌టాప్‌ పేరుకు తగినట్లుగా సన్నగా, నాజూకైన డిజైన్‌లో వచ్చింది. 1.24Kg బరువుతో 14.8mm మందంతో ఇది సెగ్మెంట్‌లోని సొగసైన ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ల్యాప్‌టాప్‌ 10వ జెన్ ప్రాసెసర్‌ల ఆధారంగా i3, i5, i7 అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఛాయిస్ లలో అందుబాటులో ఉంటుంది. ఇది Windows 11 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది. హీట్ ఎక్కకుండా ఇందులో ICE STORM 1.0 కూలింగ్ వ్యవస్థ కూడా ఉంది. ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి..? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.

Infinix InBook X1 Slim ల్యాప్‌టాప్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 14 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లే

- 16 GB RAM,  512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

- ఇంటెల్ కోర్ i3-1005G1/కోర్ i5-1035G1/కోర్ i7-1065G7 10వ-తరం ప్రాసెసర్

- Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్

- 50Whr లిథియం-పాలిమర్ బ్యాటరీ,  65W టైప్-సి ఛార్జర్

- మిగతా వివరాలను పరిశీలిస్తే బ్యాక్‌లిట్ కీబోర్డ్, డ్యూయల్ DTS ఆడియో సెటప్, డ్యూయల్ స్టార్-లైట్ HD వెబ్ కెమెరా, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi , బ్లూటూత్ 5.1 ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా రెండు USB టైప్-C పోర్ట్‌లు, రెండు USB 3.0 పోర్ట్‌లు, ఒక HDMI 1.4, ఒక SD కార్డ్ స్లాట్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌ బేస్ వేరియంట్ కోసం రూ, 29,990/- ధరకు లభిస్తుండగా, ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర, రూ. 49,990కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో కొంత డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios