హాంకాంగ్‌కు చెందిన  మొబైల్‌ తయారీదారి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్స్ భారతదేశంలో ఈ రోజు మొదటిసారిగా  ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్‌లలో భాగంగా కొనుగోలుదారుల కోసం జీరో ఈ‌ఎం‌ఐ  ఆప్షన్ అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో హోల్-పంచ్ డిస్ ప్లే డిజైన్, మీడియాటెక్ హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, లో లైట్ సెన్సార్ ఉన్నాయి.

భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ధర రూ. 9.499. ఫోన్ సింగిల్ వెరీఎంట్ 4 జిబి + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఈ ఫోన్ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభించనుంది. 

also read ఇక పై 100 ఎస్‌ఎంఎస్‌లు దాటితే నో చార్జెస్..

 ఓషన్ బ్లూ, వైలెట్ కలర్ రెండు ఆప్షన్స్ లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం ఆఫ్, నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ల ద్వారా రూ. నెలకు 792 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో డ్యూయల్ సిమ్ స్లాట్‌లకు (నానో), ఆండ్రాయిడ్ 10, 6.6-అంగుళాల హెచ్‌డి + (720x1,600 పిక్సెల్స్) హోల్-పంచ్ ఎల్‌సిడి ఐపిఎస్ డిస్ ప్లే, 2.0Ghz ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెసర్‌, 4జి‌బి ర్యామ్, 64జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ (256GB వరకు) సహకరిస్తుంది.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌, కనెక్టివిటీలో బ్లూటూత్ వి5, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, యూ‌ఎస్‌బి, ఓటిజి, మైక్రో యూ‌ఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.