Asianet News TeluguAsianet News Telugu

స్నాక్ వీడియో యాప్ యూజర్లకు కేంద్రం షాక్.. వినియోగదారులు పెరుగుతున్న సమయంలోనే..

తాజాగా కొన్ని గణాంకాల ప్రకారం చైనా యాప్ స్నాక్ వీడియోని భారత ప్రభుత్వం నిషేధించింది. జూన్‌లో టిక్‌టాక్ యాప్ నిషేధించిన తరువాత వినియోగదారులని ఆకర్షించడానికి చిన్న-వీడియో యాప్స్ పుట్టుకొచ్చాయి.

 

indian Govt bans TikTok-like Snack Video app just when its popularity was surging
Author
Hyderabad, First Published Nov 25, 2020, 4:49 PM IST

భారతదేశంలో టిక్‌టాక్ నిషేదించిన తరువాత చింగారి, మిట్రాన్, రోపోసో స్నాక్ వీడియో వంటి వాటికి మంచి ప్రజాదరణ లభించింది. తాజాగా కొన్ని గణాంకాల ప్రకారం చైనా యాప్ స్నాక్ వీడియోని భారత ప్రభుత్వం నిషేధించింది.

జూన్‌లో టిక్‌టాక్ యాప్ నిషేధించిన తరువాత వినియోగదారులని ఆకర్షించడానికి చిన్న-వీడియో యాప్స్ పుట్టుకొచ్చాయి, వాటిలో స్నాక్ వీడియో యాప్ ఒకటి, ఇలాంటి ఇంటర్‌ఫేస్ ఉన్న యాప్ షార్ట్-ఫారమ్ రీమిక్స్ వీడియోలను రూపొందించడానికి అనేక సాధనాలను అందిస్తుంది.

భారతదేశంలో స్నాక్ వీడియో యాప్ డౌన్‌లోడ్‌లు ఇతర స్వదేశీ యాప్స్ ని అధిగమిస్తున్న సమయంలో ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా ప్రభుత్వం నిషేదించిన 43 యాప్ ల జాబితాలో స్నాక్ వీడియో యాప్ కూడా ఒకటి. 

మంగళవారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఈ‌ఐ‌టి‌ఎం) స్నాక్ వీడియోతో సహా 40కి పైగా యాప్‌లపై నిషేధం జారీ చేసింది. ఈ యాప్స్ ని కేవలం నిషేధించకుండ సమాచార, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఎ కింద వాటిని ప్రభుత్వం నిరోధించింది, అంటే వాటికి అక్సెస్ నిలిపివేసింది.

భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి అందుకున్న సమగ్ర నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

also read గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో 5 యాప్స్ ఔట్.. మీరు కూడా వెంటనే వాటిని డిలెట్ చేయండి.. ...

భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, రాష్ట్ర భద్రత వంటి కార్యకలాపాలలో ఈ యాప్స్ నిమగ్నమై ఉన్నాయని పేర్కొంటూ నిషేధానికి భద్రతా కారణాలను భారత ప్రభుత్వం ఉదహరించింది. సెన్సార్ టవర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం చింగారి, మిట్రాన్ టీవీ, ట్రెల్ యొక్క డౌన్‌లోడ్ సంఖ్య మిలియన్ ల నుండి లక్షలకు పడిపోయాయి.

స్నాక్ వీడియో గురించి

స్నాక్ వీడియో యాప్‌ను కుయిషౌ టెక్నాలజీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించింది. స్నాక్ వీడియో సంస్థ చైనాలో ఉంది, టెన్సెంట్ నుండి నిధులను పొందుతుంది. స్నాక్ వీడియో యాప్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ టిక్‌టాక్ యాప్ పోటీదారుగా ప్రకటించబడింది.

స్నాక్ వీడియో యాప్ చాలా కాలం నుండి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది, ఎందుకంటే నిషేధించబడిన యాప్స్ మొదటి లిస్ట్ జారీ చేసినప్పుడు భారత ప్రభుత్వం దృష్టి నుండి స్నాక్ వీడియో తప్పించుకోగలిగింది.

కానీ, దేశానికి హానికరంగా భావించే యాప్‌ను ప్రభుత్వం గుర్తించి, దానిని నిషేధించినట్లు ప్రకటించింది.  గత 30 రోజుల్లో, స్నాక్ వీడియో భారతదేశంలో 35 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios