న్యూఢిల్లీ : భారతదేశం, చైనా సరిహద్దుల మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా  కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. అప్పటి నుండి భారతదేశ ప్రజలు చైనా దేశ యాప్ లను బదులు ఇండియన్  యాప్స్ లను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే భారతీయుల కోసం ఇప్పుడు ఒక కొత్త సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశ మొట్టమొదటి అధికారిక సోషల్ మీడియా సూపర్ యాప్ ఎలిమెంట్స్ యాప్ ని భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు  రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లుగా ఉన్న వెయ్యి మందికి పైగా ఐటి నిపుణులు ఈ యాప్‌ను నిర్మించారు.

"భారతదేశం ఒక ఐటి పవర్ హౌస్, ఈ రంగంలో మనకు ప్రపంచంలోనే ప్రసిద్ధ పేర్లు ఉన్నాయి. ప్రతిభావంతులైన నిపుణుల నుండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు రావాలని నేను భావిస్తున్నాను ”అని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఈ యాప్‌ను ప్రారంభించినప్పుడు అన్నారు.

సోషల్ మీడియా ప్రపంచంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి దిగ్గజాలతో ఈ యాప్ పోటీపడనుంది. ఎనిమిది భాషల్లో లభించే ఈ యాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో 5 లక్షలకి పైగా డౌన్‌లోడ్‌లను చేసుకున్నారు. ఈ యాప్ సగటున 4.4 స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది.

also read జీమెయిల్‌లో అనవసరమైన మెయిల్స్‌ ‌‌ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. ..

 ఈ యాప్ ద్వారా వినియోగదారులు “స్నేహితులతో కనెక్ట్ అవ్వవచ్చు, మాట్లాడవచ్చు , అప్ డేట్స్ పంచుకోవచ్చు, వ్యక్తులతో నెట్‌వర్క్ చేయవచ్చు, ఇంట్రెస్టింగ్ వంటివి కనుగొనవచ్చు, ఎటువంటి ఆటంకం లేని వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చుఅంతే కాదు ఇంకా ఇందులో మరెన్నో చేయవచ్చు” అని ప్లే స్టోర్‌లో దాని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ యాప్‌లో ఉన్న మరొక అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే.. ఆడియో-వీడియో కాల్‌లను, ప్రైవేట్ చాట్ కనెక్షన్‌ను ఉచితంగా అనుమతించడం.  వినియోగదారుల డేటా ఇండియాలో స్టోర్ చేయడం, యూజర్ డేటా వారి అనుమతి లేకుండా మూడో పార్టీతో షేర్ చేసుకోవడం వంటి సమస్యలు ఉండవని ఎలిమెంట్స్ యాప్ హామీ ఇస్తున్నది అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకుముందు ఆత్మనీర్భర్ భారత్ (స్వయం ప్రతిపత్తి గల భారతదేశం) కోసం పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను భారతదేశం కోసం నిర్మించాలని కోరారు. టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై నిషేధం తరువాత ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్‌ వెలుగు చూసింది.