Asianet News TeluguAsianet News Telugu

వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌..

హౌస్ బ్రాడ్ బాండ్ సేవలను చౌకధరకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టినందున వారిపై భారం పడకుండా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
 

India considers license fee cut for household broadband service
Author
Hyderabad, First Published Jun 25, 2020, 12:55 PM IST

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పెరుగుతున్న ధోరణితో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ పెరిగింది. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు లైసెన్స్ ఫీజును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ కారణంగా, దేశీయ ఇంటర్నెట్ సేవలు విస్తరించడంతోపాటు ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, దేశంలో ప్రస్తుతం 1.98 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు ఉన్నారు. దేశంలోని గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు సంపాదించిన సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) పై లైసెన్స్ ఫీజును తగ్గించేలా ఈ కొత్త ప్రతిపాదనలు ఉండనున్నట్టు తెలుస్తున్నది. 

ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంచనా లైసెన్స్ ఫీజు ప్రస్తుతం 8 శాతంగా.. ఏడాదికి రూ .880 కోట్లుగా అంచనావేస్తున్నారు. లైసెన్స్ ఫీజును సంవత్సరానికి రూ.1 కు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇంకా కేబినెట్ అనుమతి రాలేదు. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని, బహిర్గతం చేయొద్దని కేంద్రం వివిధ మంత్రిత్వశాఖలను కోరినట్లు సమాచారం. 

also read తెలుగు వారికోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్...షాపింగ్ ఇక మరింత సులభంగా...

ఈ ప్రతిపాదనతో ప్రభుత్వానికి సుమారు రూ.592.7 కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల డొమెస్టిక్‌ నెట్‌వర్క్‌లను అందించే బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల ఆదాయంలో 10 శాతం పెరుగుదల ఉంటుంది.

ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్లయితే, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, వొడాఫోన్-ఐడియా, భారతీయ ఎయిర్ టెల్ అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ కూడా దీని నుంచి ప్రయోజనం పొందుతుంది. ఇంటి బ్రాడ్‌బ్యాండ్ చౌకగా ఉండటానికి మాత్రమే ఈ ప్రతిపాదనను తెస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.

ప్రత్యేకించి రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సేవలను మరింత విస్తరించడానికి వీలు కలుగుతుంది. లైఫ్ టైమ్ సబ్ స్క్రైబర్ల కోసం ఫ్రీ హై డెఫినిషన్ టెలివిజన్ జియో ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తోంది. ఇంటి బ్రాడ్ బాండ్ మినహా కార్పొరేట్, వాణిజ్య అవసరాలకు వాడే బ్రాడ్ బాండ్ సేవలపై చార్జీలకు మాత్రం మినహాయింపు లేదని తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios