భారతీయ ఉద్యోగులలో 88 శాతం మంది వర్క్ ఫ్రోం హోంకే(డబల్యూఎఫ్ఓ) ఇష్టపడుతున్నారని, 69 శాతం మంది రిమోట్గా పనిచేసేటప్పుడు వారి ఉత్పాదకత పెరిగిందని నమ్ముతున్నారని యస్‌ఏపీ కాంకర్ సర్వే బుధవారం వెల్లడించింది.

 దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన 300కంపెనీల ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదికను తయారీ చేసినట్లు కాంకర్‌ సర్వే తెలిపింది. ఇంట్లో పని చేయడంతో చాలా సమయం ఆదా అవుతుందని, కంపెనీలకే లాభమని ఉద్యోగులు విశ్వసిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది.

ఎక్స్ పెన్సెస్, ట్రావెల్, ఇన్వాయిస్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్‌ఏ‌పి కాంకర్ నిర్వహించిన సర్వేలో కేవలం 11 శాతం భారతీయ సంస్థలు ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియలను స్వీకరించాయని చూపిస్తుంది.

also read గూగుల్ ప్లేస్టోర్ నుండి 29యాప్స్ తొలగింపు.. వెంటనే మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి ...

ఆఫీసులో అయితే హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ ఉంటుందని, టీమ్ వర్క్ ఉంటుందని, కొలిగ్స్ ఉంటారని కొందరు భావిస్తున్నారు. భారతదేశం అంతటా మధ్య నుంచి పెద్ద సంస్థలలో 36 శాతం వరకు ఇప్పటికీ వ్యాపార ఖర్చులను సబ్మిట్ చేయడానికి మాన్యువల్ ప్రక్రియను ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది.

ఆధునిక పేమెంట్ పద్ధతులకు ప్రస్తుత వ్యయ నిర్వహణ వ్యవస్థల మద్దతు సరిపోదని అధ్యయనం కనుగొంది. భారతదేశంలో 76 శాతం మంది ఉద్యోగులకు వారి సంస్థలు సబ్సిడీలను అందిస్తున్నాయని ల్యాబ్స్‌ట్యాబ్స్‌, మొబైల్ ప్లాన్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పూర్తిగా అందిస్తున్నట్లు తెలిపారు.

22 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమ సంస్థలు ఇంట్లో పని వాతావరణానికి అవసరమైన అన్ని ఖర్చులను భరించాలని కోరుకుంటున్నట్లు నివేదికలో తెలిపింది. 1శాతం మంది మాత్రం తాము ఇంటి నుండి లేదా ఆఫీసుల్లో ఎక్కడైన పని చేసేందుకు సిద్ధమని తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రముఖ టెక్ కంపెనీలతో సహ అన్నీ వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం వేసలుబాటును కల్పించిన సంగతి తెలిసిందే.