చైనా టెక్ దిగ్గజం హువావే శుక్రవారం రోజున చైనాలో జరిగిన కార్యక్రమంలో నోట్‌బుక్, స్మార్ట్‌వాచ్, ఆడియో యాక్సెసరీలతో  సహా ఆరు కొత్త ఉత్పత్తులను ప్రకటించింది. కొత్త ఉత్పత్తులలో హువావే మేట్‌బుక్ ఎక్స్, మేట్‌బుక్ 14, ఫ్రీబడ్స్ ప్రో, ఫ్రీలేస్ ప్రోతో పాటు రెండు కొత్త లైట్ వెట్ నోట్‌బుక్‌లు, మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఎఎన్‌సి) ఆడియో ఉత్పత్తుల కొత్త ప్రో-వేరియంట్లు ఉన్నాయి.

కొత్త ఫిట్‌నెస్ డేటా ట్రాకింగ్ ఫీచర్లు, వర్కౌట్ మోడ్‌లతో హువావే వెరబుల్ ఎంట్రీలైన వాచ్ జిటి 2ప్రో, వాచ్ ఫిట్ ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. "భవిష్యత్తులో, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మరింత స్మార్ట్, అధిక-నాణ్యత అనుభవాలను అందించడానికి మా భాగస్వాములతో కలిసి పనిచేయడం కొనసాగిస్తాము,"హువావే కన్స్యూమర్ బిజి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒ  రిచర్డ్ యు ఒక ప్రకటనలో తెలిపారు.

నోట్‌బుక్‌ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, ఇది రోజువారీ పనికి అవసరమైన పనితీరును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

also read వోడాఫోన్ ఐడియా ‘వీఐ’ కొత్త ప్లాన్లు.. ఇక ఆన్ లిమిటెడ్ కాలర్‌ట్యూన్‌లను సెట్ చేసుకోవచ్చు.. ...

హువావే మేట్‌బుక్ 14 AMD రైజెన్ 4000 H సిరీస్ ప్రాసెసర్‌ను అనుసంధానించింది. గొప్ప పనితీరుతో పాటు, 2కె ఫుల్‌వ్యూ డిస్ ప్లే ఉంది, స్మార్ట్ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

 ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రు వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌ఫోన్‌లు ఫ్రీబడ్స్ ప్రో అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  హువావే ఆడియో ఉత్పత్తిలో ఉత్తమ నాయిస్ క్యాన్సలేషన్ పనితీరును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త వాచ్ జిటి 2ప్రో రెండు వారాల బ్యాటరీ లైఫ్, 100 కి పైగా వర్కౌట్ మోడ్లు, ప్రో-గ్రేడ్ ఫిట్నెస్ డేటా ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది.

మేట్‌బుక్‌ 14 ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు: 14.00 అంగుళాల డిస్‌ప్లే సైజ్, రైజెన్‌ 5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, విండోస్‌ 10 హోమ్‌ ఓఎస్‌, 256జి‌బి ఎస్‌ఎస్‌డీ, 1.49 kg బరువు ఉంటుంది.